[spt-posts-ticker]

అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్‌ బ్రెయిలీ

వివేక్‌నగర్‌: అంధుల కోసం ప్రత్యేక లిపిని రూపొందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్‌ బ్రెయిలీ అని రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు డా.వకులాభరణం కృష్ణమోహన్‌రావు కొనియాడారు. లూయిస్‌ బ్రెయిలీ జయంతి సందర్భంగా అభినందన సంస్థ ఆధ్వర్యంలో బుధవారం కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించిన సమావేశంలో డా.కృష్ణమోహన్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని వసంతసుబ్బలక్ష్మి, వి.మురళీధర్‌లకు లూయిస్‌ బ్రెయిలీ అవార్డు అందజేసి సత్కరించారు. రచయిత్రి కేవీ కృష్ణకుమారి సభాధ్యక్షత వహించారు. అతిథులుగా త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, వంశీ సంస్థల వ్యవస్థాపకుడు డా.వంశీ రామరాజు హాజరయ్యారు. నిర్వహణ సంస్థ స్థాపక కార్యదర్శి భవాని స్వాగతోపన్యాసం చేశారు. సంయుక్త కార్యదర్శి శోభా పేరిందేవి అవార్డు స్వీకర్తలను పరిచయం చేశారు. సంస్థ ముఖ్యులు విశాలాక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *