[spt-posts-ticker]

అజీమ్‌ ప్రేమ్‌జీ 1,125 కోట్ల విరాళం

న్యూఢిల్లీ, (ఆరోగ్యజ్యోతి): కరోనాపై పోరుకు విప్రో అధినేత  అజీమ్‌ ప్రేమ్‌జీ రూ.1125 కోట్ల విరాళం ప్రకటించారు. అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ద్వారా రూ.1000 కోట్లు, విప్రో లిమిటెడ్‌ ద్వారా రూ.100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా రూ.25 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. విప్రో ప్రతి ఏట సీఎ్‌సఆర్‌ ఫండ్‌ కింద కేటాయించే మొత్తం కాకుండా అదనంగా ఈ విరాళాన్ని ఇచ్చారు. ఎన్నారై బిలియనీర్‌ లక్ష్మీ మిత్తల్‌ కరోనాపై పోరుకు తన వంతుగా రూ.100 కోట్లు విరాళమిచ్చారు. పుణెలో కరోనా బాధితులకు కోసం 1500 బెడ్లతో కూడిన తాత్కాలిక ఆస్పత్రిని నిర్మిస్తామని మెర్సిడెజ్‌ బెంజ్‌ ఇండియా ప్రకటించింది. అంతే కాకుండా సంస్థలో ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని మహారాష్ట్ర సీఎం సహాయ నిధికి ఇవ్వనున్నట్లు పేర్కొంది. వైద్య పరికరాల కోసం 100 కోట్ల రూపాయల విరాళం అందించిన విషయం తెలిసిందే. వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ సూట్లు, మాస్క్‌లను అందించేందుకు టిక్‌టాక్‌ యాప్‌ ముందుకొచ్చింది.

రూ.100 కోట్ల విలువైన 4 లక్షల ప్రొటెక్టివ్‌ సూట్లు, మాస్క్‌లను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు అందించడంతో పాటుగా రెండు లక్షల మాస్క్‌లను ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు అందించామని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. మధ్యప్రదేశ్‌లో 82 ఏళ్ల శలభా ఉస్కర్‌ అనే ఓ రిటైర్డ్‌ ఉద్యోగిని కరోనా సహాయ  కార్యక్రమాల కోసం తన పెన్షన్‌ నుంచి రూ.లక్ష విరాళంగా ప్రకటించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, సుధామూర్తి కుటుంబీకులు అక్షయపాత్ర ఫౌండేషన్‌కు రూ.10 కోట్ల విరాళం ప్రకటించారు. ఇన్ఫోసిస్‌ ఇప్పటికే రూ. 100 కోట్ల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. 

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *