ఆడవి ఆముదం గింజలు, ఐరన్ మాత్రల
నిలకడగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి) : ఆడవి ఆముదం గింజలు, ఐరన్ మాత్రలు తిని 19 మంది విద్యార్థులు అస్వస్ధతకు గురయ్యారు. గురువారం భీంపూర్ మండలంలోని తాంసి(కే) ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు భోజనం అనంతరం ఐరన్ మాత్రలను వైద్య సిబ్బంది వేశారు. ఈ క్రమంలో విద్యార్థులు అడవి ఆముదం గింజలు సైతం తినడంతో వాంతులు ప్రారంభమయ్యాయి. దీన్ని గమనించిన పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం ఆనంద్ వెంటనే విద్యార్థులను రిమ్స్ కు తరలించారు. ఐరన్ మాత్రలు వేయకముందు పిల్లలు అడవి ఆముదం తిన్నట్లు పిల్లలు తెలిపినారు. అడవి ఆముదం లేక ఐరన్ మాత్రలుల వాళ్ళ ఈల జరిగిందా అనిఅర్టం కాలేదు. చివరకు డైరెక్టర్ డాక్టర్ బలిరాం నాయక్ల్యాబ్ టెస్ట్ చెసేందుకు సిద్దమినారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్ చందు, జిల్లా ఇమ్మునైజేషణ్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ మెత్పల్లివార్ , తాంసీ ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్య అధికారిని డాక్టర్ వాణి లు రిమ్స్ చేరుకున్నారు. అలాగే తాంసీ ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యసిబ్బంది సూపర్వైజర్ తులసిరాం, పార్మసిస్ట్ మహేందర్, ఆరోగ్య కార్యకర్తలు నగేష్, అరుణ, పుష్పలత చేరుకున్నారు.
రిమ్స్ లో విద్యార్థులకు ప్రత్యేక వార్డును కేటాయించి వైద్యచికిత్సలు అందించారు. రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బలిరాం నాయక్‌తోపాటు పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గజానన్, డాక్టర్ శరత్ రెడ్డి,రెండు గంటలపాటు వైద్యచికిత్స అందించారు. అలాగే తాంసీ ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్య అధికారిని డాక్టర్ వాణి కూడా ,రెండు గంటలపాటు అందిచారు. తిరిగి ఆమె రాత్రి 11 గంటలకు వచ్చి పిల్లలను పరీక్షించారు. సమాచారం అందుకున్న డీఈవో రవీందర్‌రెడ్డి రిమ్స్ కు చేరుకుని ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడారు. కొందరు విద్యార్థులు ఐరన్ మాత్రలు వేసుకున్నామని, మరి కొంత మంది విద్యార్థులు అడవి ఆముదం గింజలు తిన్నామని తెలిపారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ… విద్యార్థులకు నాణ్యమైన చికిత్సలు అందిస్తున్నామన్నారు. ఐదుగురు పిల్లల వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్సలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు. తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. రక్త పరీక్షలు నిర్వహించి ల్యాబ్‌కు పంపించామన్నారు. ఈ విషయాన్ని డీఈవో రవీందర్‌రెడ్డి కలెక్టర్ శ్రీ దేవసేనకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, డిప్యూటీ సూపరింటెండెంట్ కల్యాణ్‌రెడ్డి, వైద్యులు గజానాథ్, శారత్రెడ్డి, తిరుమల్‌రెడ్డి, మాజీ మండలపరిషత్ అధ్యక్షుడు లక్ష్మన్న, సర్పంచ్ కరీం, ఎంఈవో కౌలస్య, సీఆర్డీ రవీందర్ తదితరులు ఉన్నారు.