[spt-posts-ticker]

అడవి ఆముదం తిన్న విద్యార్థులు కోలుకున్నారు

పరిసరాల పరిశుభ్రత వల్ల వ్యాధులు దూరం..

భీంపూర్, ఆదిలాబాద్ (ఆరోగ్య జ్యోతి): పరిసరాల పరిశుభ్రత వల్ల వ్యాధులు దరిచేరవని తాంసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వాణి అన్నారు. మూడు రోజుల క్రితం అడవి ఆముదం గింజలను తిని అస్వస్థతకు గురైన 19 విద్యార్థులను  శనివారం రోజు ఆమె పాఠశాలకు వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవి ఆముదం తినడం వల్ల విద్యార్థులకు వంతులు  వచ్చాయని ఆమె తెలిపారు. విద్యార్థులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించా రు. పరిశుభ్రత పాటించాలని సూచించారు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం పథకం కింద వంట చేస్తున్న వారు పరిశుభ్రత పాటించాలని వారికి సూచించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించాలని ఉపాధ్యాయులకు గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు  అరుణ, పుష్పలత, ఆశా కార్యకర్త త్రివేణి ఉపాధ్యాయులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *