[spt-posts-ticker]

అన్ని డిష్‌లలో స్వయంప్రభ చానల్స్‌ !

విద్యసంబంధమైన స్వయం ప్రభ చానల్స్‌ ఇక నుంచి అన్ని డిష్‌టీవీల ద్వారా అందుబాటులో ఉంటాయని కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి ప్రకటించారు. అధిక నాణ్యత గల పాఠ్యాంశాలను అందించే 32 డీటీహెచ్‌ చానళ్ల సమూహమైన స్వయం ప్రభ చానల్‌ ఇప్పుడు టాటా స్కై, ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌లలో కూడా అందుబాటులో ఉంటాయి. స్వయంప్రభ చానళ్లు ఇప్పటివరకు డీడీ-డీటీహెచ్‌, డిష్‌ టీవీ, జియోటీవీ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉండేవి.

  • ఎక్కువ మంది విద్యార్థులకు ఈ విద్యా ప్రసారాలు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ టాటా స్కై, ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌ ఆపరేటర్లను తమ డీటీహెచ్‌ ప్లాట్‌ఫామ్‌లో కొన్ని స్వయంప్రభ చానళ్లను ప్రసారం చేయాలని అభ్యర్థించారు.
  • వారి అభ్యర్థన మేరకు రెండు ఆపరేటర్లు తమ ప్లాట్‌ఫామ్‌లో మూడు స్వయంప్రభ చానళ్లను ప్రసారం చేయడానికి అంగీకరించారు. ఈ ప్రసారాలు ఉచితంగా అందిస్తారు. విద్యార్థులు ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో టీవీల ద్వారా విద్యను కొనసాగించాలని మంత్రి నిశాంక్‌ సూచించారు.
  • స్వయంప్రభ మొత్తం 32 చానల్స్‌ సమాహారం. వీటిలో కళలు, సైన్స్‌, వాణిజ్యం, ప్రదర్శన కళలు, హ్యుమానిటీస్‌ సబ్జెక్టులు, ఇంజనీరింగ్‌, టెక్నాలజీ, లా, మెడిసిన్‌, వ్యవసాయం మొదలైన విభిన్న విభాగాలను కవర్‌ చేసే అధిక నాణ్యతగల విద్యాపాఠ్యాంశాల ఆధారిత కోర్సుల విషయాలను అందిస్తారు.
  • ఎయిర్‌టెల్‌ టీవీలో – చానల్‌ నం.475, చానల్‌ నం.476, చానల్‌ నం.477లలో స్వయంప్రభను చానెళ్లను వీక్షించవచ్చు.

టాటా స్కై: చానల్‌ నం.756. ఇది స్వయంప్రభ చానల్‌ కోసం విండోను ఏర్పాటు చేస్తుంది.

డిష్‌ టీవీ: చానల్‌ నం.946, చానల్‌ నం.947, చానల్‌ నం. 949, చానల్‌ నం.950.

విద్యార్థులు ఈ చానళ్లలో, NIOS యూట్యూబ్‌ చానల్‌లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 6 గంటల రికార్డ్‌ ప్రసారంతో విద్యా కార్యక్రమాలు చూడవచ్చు. తరువాత మధ్యాహ్నం 1 నుంచి 7 గంటల వరకు 6 గంటల లైవ్‌సెషన్‌ ఉంటుంది. ప్రతి ప్రసారం కోసం, నలుగురు వేర్వేరు విషయ నిపుణులు ఒక్కొక్కటి ఒకటిన్నర గంటల సెషన్‌ తీసుకుంటారు. అభ్యాసకులు ఇంటి నుంచి ఫోన్‌కాల్‌ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *