న్యూ ఢిల్లీ: రోనా రోగుల వైద్య ేసవలో నిమగ్నమైన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆశ కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ బీమా పథకం దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో.. ప్రభుత్వ వైద్య రంగంలోని 22.12 లక్షల మందికి బీమా రక్షణ లభిస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సుధాన్ అభిప్రాయపడ్డారు. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పథకం మార్చి 30 నుంచి 90 రోజులపాటు అమల్లో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కరోనా రోగులకు ేసవలు అందిస్తూ వైద్యులు, ఇతర సిబ్బంది వాటి బారిన పడే ప్రమాదం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని అమలు చేస్తోంది.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]