అమీర్‌పేట, (ఆరోగ్యజ్యోతి): అమీర్‌పేటలో మంగళవారం మధ్యాహ్నం పిచ్చి కుక్క దాడిలో గాయపడిన బాధితుల్లో ఆరుగురికి స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించి నారాయణగూడలోని ఐపీఎంకు పంపారు. ధరంకరం రోడ్డులోని పైవేటు ఆసుపత్రుల్లో మరో 12మంది, నల్లకుంటలోని ఫీవరాసుపత్రిలో నలుగురు చికిత్స చేయించుకున్నారు. బల్దియా సర్కిల్-17 వెటర్నరీ అధికారి డా.జేవ్యానాయక్ మాట్లాడుతూ దాడి చేసి కరిచిన శునకానికి అంతకుముందే రేబిస్ సోకినట్లు అనుమానిస్తున్నామన్నారు. బాధితులు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని, నారాయణగూడలోని ఐపీఎంలో ఉచితంగా ఇది అందుబాటులో ఉంటుందన్నారు. కాగా జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ తరహా సంఘటనలు జరుగుతున్నాయని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షులు అచ్యుతరావు అన్నారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
అమీర్‌పేటలో కుక్కల కలకలం
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]