[spt-posts-ticker]

అమృత వర్షిని ఆధ్వర్యంలో అన్నదానం

ప్రతి రోజు 30 మందికి అన్నదాన కార్యక్రమం
జయశంకర్ భూపాలపల్లి.(ఆరోగ్యజ్యోతి): జయశంకర్ భూపాలపల్లి పట్టణంలో గల అమృతవర్షిని అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి రోజు 30 నుండి 40 మందికి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న వృద్ధాశ్రమం తో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన వలసకూలీల కు పది మందికి అన్నదాన కార్యక్రమాన్ని గత కొన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసి కొందరు దాతలు ముందుకు రాగా మరికొందరు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అమృత వర్షిని అక్షర స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కుసుమా శైలజా శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేయడం తనకు ఆనందంగా ఉందన్నారు.వృద్ధాశ్రమంలో 30 మందికి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నామని దీనితో పాటు పది మంది వలస కూలీల కు ప్రతి రోజూ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు కొంతమంది దాతలు ముందుకు వచ్చిన మరికొందరు అభినందనలు తెలుపుతున్న విషయం చాలా సంతోషకరమైన అన్నారు. దాతలు ముందుకు వస్తే అన్నదాన కార్యక్రమాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *