న్యూయార్క్: ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పుడు జంతువులకూ సోకడం మొదలైంది. పిల్లి జాతి జంతువుల్లోకి కరోనా వైరస్ ప్రవేశించే అవకాశముందని శాస్త్రవేత్తలు నిర్ధారించిన నేపథ్యంలో న్యూయార్క్‌లోని బ్రాంక్జ్ జంతు ప్రదర్శన శాలలో నాదియా అనే నాలుగేళ్ల పులి ఈ వైరస్ బారిన పడింది. గత ఏడాది డిసెంబరులో చైనాలోని వూహాన్లో ముందుగా కనిపించిన కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషుల్లోకి ప్రవేశించిందని అంచనా. హాంకాంగ్‌లో ఇప్పటికే రెండు కుక్కలకు ఈ వ్యాధి సోకినట్లు సమాచారం.
వన్యప్రాణులు, జూల్లోని జంతువులపై ప్రత్యేక దృష్టి
ప్రత్యేకించి కెమెరా ట్రాప్‌ల ద్వారా పులుల పరిశీలన
వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే తెలపాలని ఆదేశాలు
‘న్యూయార్క్ పులి’ ఉదంతంతో అటవీశాఖ హైఅలర్ట్
న్యూయార్క్,హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పుడు జంతువులకూ సోకడం మొదలైంది. పిల్లి జాతి జంతువుల్లోకి కరోనా వైరస్ ప్రవేశించే అవకాశముందని శాస్త్రవేత్తలు నిర్ధారించిన నేపథ్యంలో న్యూయార్క్‌లోని బ్రాంక్జ్ జంతు ప్రదర్శన శాలలో నాదియా అనే నాలుగేళ్ల పులి ఈ వైరస్ బారిన పడింది. గత ఏడాది డిసెంబరులో చైనాలోని వూహాన్లో ముందుగా కనిపించిన కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషుల్లోకి ప్రవేశించిందని అంచనా. హాంకాంగ్‌లో ఇప్పటికే రెండు కుక్కలకు ఈ వ్యాధి సోకినట్లు సమాచారం.
కరోనా నేపథ్యంలో రా ష్ట్ర అటవీశాఖ హైఅలర్ట్ ప్రకటించింది. ›అభయారణ్యాల్లోని పులులు, జింకల పార్కుల్లో ని జింకలు, జూలలోని జంతువుల్లో వైరస్ ల క్షణాలను పరిశీలించడంతో పాటు, వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను పీసీసీఎఫ్ ఆర్.శోభ ఆదేశిం చారు. పులులు ముక్కు కారడం, దగ్గు, ప్ర యాసపడి ఊపిరి తీసుకోవడం వంటి లక్షణా లతో బాధపడుతున్నాయా అనేది ప్రత్యక్షం గా లేదా కెమెరా ట్రాప్‌లతో పరిశీలించాలని సోమవారం తాజాగా జారీచేసిన ఆదేశాల్లో స్పష్టంచేశారు. సోమవారం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ రాష్ట్రాలకు జారీచేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఈ ఆదేశాలిచ్చారున్యూయార్క్లోని బ్రాంక్స్ జూలోని పులి కి కోవిడ్–19 వైరస్ సోకినట్టు, ఇది ఇతర జం తువులకు వ్యాప్తి చెందే ప్రమాదంపై ఆదివారం యూఎస్ నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ ల్యాబొరేటరీస్ ప్రకటించిన దరిమిలా.. జాతీయ పార్కులు, అభయారణ్యాలు, టైగర్ రిజర్వు ల్లో జంతువుల నుంచి జంతువులకు, మనుషుల నుంచి జంతువులకు, జంతువుల నుం చి మనుషులకు వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్లు, పీసీసీఎఫ్‌లకు కేంద్ర అటవీ శాఖ వైల్డ్‌లైఫ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. గోపీనాథ్ ఆదేశాలు జారీచేశారు. వైరస్ వ్యా ప్తి నేపథ్యంలో ఫీల్డ్ మేనేజర్, వెటర్నరీ డాక్ట ర్లు, అటవీ సిబ్బందితో టాస్క్‌ఫోర్స్, ర్యాపి డ్ యాక్షన్ ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలన్నారు.
అడవుల్లో జంతు సంరక్షణ ఇలా..
పులుల సంరక్షణ సిబ్బంది.. పోస్ట్‌మార్టమ్ నిర్వహించాల్సిన కేసుల్లో స్థలం, లింగం, వయసు వంటివి రికార్డ్ చేయడంతో పాటు వైరస్ నిర్ధారణకు సంబంధించి నమూనాలు తీసుకోవాలని, సిబ్బంది పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఉపయోగించాలని తాజా ఆదేశాల్లో సూచించారు. వైరస్ ధ్రువీకరణ కోసం పులులు, ఇతర జంతువుల నమూనాలను ఐసీఏఆర్ ధ్రువీకరించిన ల్యాబ్‌లకు పంపిం చాలని పేర్కొన్నారు. జంతువుల సహజ మ రణాలను ఫీల్డ్‌స్టాఫ్ గుర్తించిన వెంటనే పై అధికారులకు తెలపడంతో పాటు వాటి శాం పిళ్లను మార్గదర్శకాలకు అనుగుణంగా సేకరించి పరీక్షల నిమిత్తం భోపాల్, హిస్సార్, బరేలిలోని సంబంధిత పరిశోధన సంస్థలకు పంపించాలని సూచించారు. అటవీప్రాంతా లు, గ్రామాల్లో సంచరించే కోతులు, లంగూర్లలో కారోనా లక్షణాలున్నాయా అనేది గమనించాలని, అడవుల్లో సాసర్పిట్లను నింపే సిబ్బంది శానిటైజ్ కావాలని, టైగర్జోన్లు, అడవుల్లోకి సందర్శకులను వెళ్లనివ్వరాదని, సిబ్బంది జం తువుల దగ్గరకు వెళ్లడం, కృత్రిమ ఆహా రం పెటవద్దని ఆదేశించారు.
24 గంటలూ..
రాష్ట్రంలోని జూలు, జింకల పా ర్కుల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా 24 గంటలూ సీసీటీవీల ద్వారా పరిశీలించి, జం తువుల ప్రవర్తన ఎలా ఉందో గమనించాలని పీసీసీఎఫ్ ఆదేశించారు. జూలలోని పులులు, ఇతర జంతువుల్లో అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే శాంపిళ్లను ఐసీఎంఆర్ సూ చించిన పరిశోధన సంస్థలకు పంపించాలని సూచించారు. సిబ్బంది అనారోగ్యంతో ఉం టే జూ, జింకల పార్కుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లొద్దని ఆదేశించారు.
జంతువుల ప్రవర్తన మారిందా?
లాక్‌డౌన్‌తో అడవుల మీదుగా రాకపోకలు (అత్యవసరమైనవి మినహా) ఆగిపోయాయి. కాలుష్యం తగ్గి పర్యావరణపరం గా మంచిమార్పులు చోటుచేసుకుంటున్నా యి. ఫలితంగా అడవుల్లో వన్యప్రాణుల సంచారం పెరిగింది. జంతువులు అటవీ ప్రాంతాల్లోని రోడ్లపైకి వస్తున్నాయి. ఈ సందర్భంగా ఇవెలా ప్రవర్తిస్తున్నాయో పరిశీలన, అధ్యయనం చేయాలని కన్జర్వేటర్ ఆఫ్ ఫా రెస్ట్స్, డీఎఫ్‌వోలు, ఎఫ్‌డీవో లను అటవీశాఖ ఆదేశించిం ది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్, ఏటూరు నాగారం ఇతర అభయారణ్యాల్లోని జంతువుల కదలికలను కెమెరా ట్రాప్‌ల ద్వారా సునిశితంగా ప రిశీలించాలని, అవి ఆహారాన్ని తీసుకునే పద్ధతుల్లో మార్పు వచ్చిందా? సహజ ప్రవర్తనకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయా? అనే దానిపై దృష్టిపెట్టాలని ఆదేశించింది. అడవుల్లోని కెమెరా ట్రాప్లను నీటికుంట లు, వనరుల వద్దకు, జంతువులు ఎక్కువగా రోడ్లు దాటేచోట్లకు మార్చి వాటి ప్రవర్తనను పరిశీలించాలని సూచించింది.