[spt-posts-ticker]

అరుదైన వ్యాధులకు రూ.15 లక్షల వరకు సాయం

దిల్లీ, (ఆరోగ్యజ్యోతి): అరుదైన వ్యాధులతో సతమతమవుతున్న రోగులకు ఏకకాల చికిత్స వ్యయం కింద ‘రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకం’ ద్వారా రూ.15 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రం యోచిస్తోంది. దీని కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా రూపొందించి, ప్రజలు దానిపై అభిప్రాయాలు తెలిపేందుకు ఫిబ్రవరి 10 వరకు గడువునిచ్చింది. పేద కుటుంబాలతో పాటు మొత్తం జనాభాలో 40% మంది దీనికి అర్హులవుతారు. ప్రభుత్వ పరిధిలోని మూడో అంచెలో ఉన్న ఆస్పత్రుల్లో పొందే చికిత్సలకే ఈ సాయం పరిమితం. దీనికోసం దిల్లీలోని ఎయిమ్స్‌ వంటి కొన్ని వైద్య సంస్థల్ని కేంద్రం నోటిఫై చేయనుంది. వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే ఆన్‌లైన్‌ విరాళాల ద్వారా రోగుల చికిత్స వ్యయాన్ని భరిస్తుంది. ఎముకలు పెళుసుబారి విరిగిపోతుండడం, తలసీమియా, హీమోఫీలియా వంటివి ఈ సాయానికి అర్హమైనవి.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *