[spt-posts-ticker]

అవసరం లేకున్నాబయటకు…

ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి) :ఒక ఆయన మెడికల్     అంటుండు. ఇంకొకాయన కూరగాయలు  కోసం…మరొకరు…ఏడాది క్రితం నాటి మందుల చిట్టీ పట్టుకొస్తుండు… మరొకరు కిరానా దుకాణానికి అంటూ .. రోడ్లమిడికి వస్తున్నారు. ఎందుకు రోడ్ల మీదికి వస్తున్నారని జనాన్ని ప్రశ్నిస్తే ఇలాంటి సమాధానాలు వస్తున్నాయి…’అంటూ  పోలీసులు చెపుతున్నారు. పట్టణంలో ఎంత కంట్రోల్ చేసిన కావడం లేదు. పొలిసు ఎండలో నిలబడి విదులు చేస్తున్న నిమిసనిమిశం ప్రజల నుంచి వస్తున్నా సమాధానాలు ఇవే….. ‘మేం రాత్రింబవళ్లు శ్రమిస్తుంటే..ఎవ్వరూ అర్ధం చేసుకోవడం లేదు. తలాతోకా లేని కారణాలతో రోడ్లపైకి వచ్చి కోవిడ్‌లాక్‌డౌన్‌ను లైట్‌గా తీసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. ‘కొంతమంది తప్పుడు స్టిక్కర్లు వాహనాలకు అంటించుకుంటున్నారు. ఆటోవాలాలు ప్రయాణికులనుఎక్కించుకుని..ఆస్పత్రికి వెళ్తున్నామంటూ అబద్ధాలు చెబుతున్నారు’ అని కోవిడ్‌ విధుల్లో ఉన్న పలువురు పోలీసులు సాక్షి వద్ద వాపోయారు.మార్కెట్లు, రేషన్‌ షాపుల వద్ద మరీ ఎక్కువ రద్దీ నెలకొంది. నిలదీసిన పోలీసులకు పలువురు అబద్ధాలు చెప్పడం…దొంగదారిలో తప్పించుకోవడం వంటి సంఘటనలు సైతం వెలుగుచూశాయి.

 కరోనా వైరస్‌ వ్యాప్తిని బ్రేక్‌ చేయాలంటే లాక్‌డౌన్‌ను పాటించాల్సిందే.. నిత్యవసర వస్తువుల కోసం బయటకు వెళ్లాల్సి వస్తే సోషల్‌ డిస్టెన్స్‌ మెయింటెన్‌ చేయాల్సిందే.. నివాసముండే పరిధి నుంచి మూడు కిలోమీటర్లు దాటి బయటకు వెళ్తే కేసులు నమోదు చేస్తామంటూ ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా చాలామంది ప్రజల్లో మార్పు రావడం లేదు. ఏవేవో సాకులు చెబుతూ రోడ్లపై ఎంజాయ్‌ చేస్తున్నారు. కూరగాయలు, పండ్లు, పాలు, పప్పు, పంచదారా అంటూ కాలనీల్లోని రోడ్లపై కొంతమంది తిరుగుతుండగా.. మందుల చీటీలు పట్టుకొని మరికొందరూ దూరప్రాంతాలకు వెళ్తున్నారు.  కొందరు ఆటోవాలాలు మరో అడుగు ముందుకేసి ప్రయాణికులను ఆస్పత్రులకు తీసుకెళ్తున్నామంటూ పోలీసులను బురిడీ కొట్టిస్తున్నారు. పోలీసుల చెకింగ్‌ పాయింట్లు ఎక్కడున్నాయోతెలుసుకొని సందులు, గొందులు దాటుకొని రోడ్లపైకి వెళ్తున్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *