లక్నో: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ యూపీ రాష్ట్రంలో రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా సెంట్రల్ జైలులో ఓ ఖైదీకి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గత నెలన్నర నుంచి సందర్శకులు, బయటి వక్తులు రానప్పటికీ ఓ ఖైదీకి కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ సలహా మేరకు రీ చెక్ కోసం శాంపిల్ పంపారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]