[spt-posts-ticker]

ఆదిలాబాద్‌ రిమ్స్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు..

 

ఆదిలాబాద్‌ (ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న Rims ఆసుప‌త్రిలో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఈ నోటిఫికేష‌న్ భారీ ఎత్తున అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇక్క‌డ మొత్తం 25 విభాగాల్లో ఖాళీలగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ కి సంబంధించి ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ‌ సోమ‌వారం మొద‌లు కానుంది.

ఖాళీల వివ‌రాలు..

  • స్టాఫ్ న‌ర్స్ (144)
  • స్టోర్ కీప‌ర్ (06)
  • స్టెనో/టైపిస్ట్ (11)
  • రికార్డ్ క్ల‌ర్క్‌/రికార్డ్ అసిస్టెంట్ (06)
  • పెర్ఫ్యూజనిస్ట్ (01)
  • క్యాథ్ ల్యాబ్ టెక్నీషియ‌న్ (02)
  • ఈఈజీ టెక్నీషియ‌న్ (02)
  • ఈసీజీ టెక్నీషియ‌న్ (04)
  • ల్యాబ్ అసిస్టెంట్ (15)
  • ఎల‌క్ట్రిష‌య‌న్ (02)
  • ప్లంబ‌ర్ (01)
  • పీఆర్‌ఓ (02)
  • ల్యాబ్ అంటెండంట్ (08)
  • దోబీ (02)
  • బార్బ‌ర్ (01)
  • రెసిప్రేట‌రీ థెర‌పిస్ట్ (02)
  • చెస్ట్ ఫిజియోథెర‌పిస్ట్ (02
  • డ‌యాల‌సిస్ టెక్నీషియ‌న్ (03)
  • ఫార్మ‌సిస్ట్ (03)
  • రేడియో గ్రాఫ‌ర్ (04)
  • డిజిట‌ల్ ఇమేజింగ్ టెక్నిషియ‌న్ (02)
  • సిటీ టెక్నీషియ‌న్ (04)
  • ఎమ్ఆర్ టెక్నీషియ‌న్ (04)
  • ఓటీ టెక్నీషియ‌న్ (04)
  • ఆప‌రేష‌న్ థియేట‌ర్ అసిస్టెంట్స్ (12).

పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌సు 18 నుంచి 34 ఏళ్ల మ‌ధ్యలో (01-07-2021 నాటికి) ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ, బీసీ అభ్య‌ర్థుల‌కు 5 సంవ‌త్స‌రాలు, పీహెచ్‌సీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు స‌డ‌లింపు ఉంది.

  • ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు 07-06-2021 నుంచి 11-06-2021 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
  • ద‌ర‌ఖాస్తుల‌కు కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మ‌హాల‌క్ష్మీ మ్యాన్ ప‌వ‌ర్ ప్లేస్‌మెంట్ స‌ర్వీస్ కార్య‌ల‌యాన్ని సంప్ర‌దించాలి.
  • పూర్తి వివరాల‌కు 9010834502, 8464848945 నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *