[spt-posts-ticker]

ఆపదలో ఆశాజ్యోతులు

  • కరోనా కట్టడిలో సర్వేలెన్‌ ్స బృందాలు.. దాడులు, ఛీత్కారాలకు వెరువని ధైర్యం 
  • అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్న ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు
  • వేరేవాళ్లకు సోకకుండా ట్రాకింగ్‌..ట్రేసింగ్‌.. ఢిల్లీ మర్కజ్‌ చైన్‌ను కనిపెట్టడంలో కీలకం 

ఒకరు ఢిల్లీ నుంచి, మరొకరు విదేశాల నుంచి వస్తారు! కంటికి కనిపించకుండా ఇంట్లోనే ఉంటారు! వైరస్‌ పరీక్షలు చేయించుకొనేందుకు ముందుకురారు. కానీ గంటల్లోనే గుర్తించే బృందం ఒకటుందని వారికి తెలియదు! ఆ బృందం సభ్యులే ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, పారామెడికల్‌ సిబ్బంది! ఇంటింటికీ తిరిగి పరీక్షలుచేస్తారు. అవసరమైతే దవాఖానకు పంపుతారు. దాడులను ఖాతరుచేయరు. కరోనాపై క్షేత్రస్థాయిలో పోరాడుతున్న సైనికులు వీరు. ” alt=”” aria-hidden=”true” />

 

హైదరాబాద్‌,(ఆరోగ్యజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడిచేందుకు తెలంగాణ సర్వైలెన్స్‌ బృందంలోని ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు, పారామెడికల్‌ సిబ్బంది ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు వైద్యం అందించడం ఒక ఎత్తయితే.. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల ద్వారా ఇతరులను సోకడాన్ని ట్రాకింగ్‌ చేసి గుర్తించడం మరోఎత్తు. ఎవరికి వైరస్‌ సోకిందో తెలియదు ఎవరు ఎలాంటి వ్యక్తులో అర్థంకాదు. వైరస్‌ వ్యాప్తి కట్టడి ప్రథమ లక్ష్యంగా సర్వైలెన్స్‌ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేయడమే ప్రస్తు త పరిస్థితుల్లో కీలకంగా మారింది. పాజిటివ్‌ వచ్చినవారి ద్వారా ఎవరికి సంక్రమించిందో గుర్తించే క్రమంలో దాడులు, అవమానాలు ఎదుర్కొంటూ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేస్తున్నా రు. ఈ బృందాల్లో రెండువేల మంది వైద్యు లు, 10 వేలమంది ఏఎన్‌ఎంలు, 27,800 మంది ఆశా కార్యకర్తలు, పారామెడికల్‌ సి బ్బంది, ఇతర సిబ్బంది 30 వేలమంది వరకు పనిచేస్తున్నారు. వీరికి అంగన్‌వాడీ వర్కర్లు, పోలీసులు, రెవెన్యూ, ఇతరశాఖలు తోడవటంతోనే వైరస్‌వ్యాప్తికి అడ్డుకట్ట పడుతున్నది.

ఛీత్కారాలను ఎదుర్కొంటూ సేవ

పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కాంటాక్ట్‌ అయిన వారిని ట్రేసింగ్‌ చేయడంలో సర్వైలెన్స్‌ బృం దం ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. కొందరు  మాకు ఇంకోసారి ఫోన్‌ చేయొద్దంటూ హెచ్చరించిన సందర్భాలున్నాయి. మాకు ఏ రోగం రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండురోజుల కిందట ఢిల్లీ ప్రార్థనకు హాజరైన వ్యక్తి వివరాల సేకరణకు వెళ్లిన ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎంపై ఆదిలాబాద్‌లో దాడి జరిగింది. కామారెడ్డిలో వివరాలు ఇవ్వబోమంటూ ఒకరు తిట్లతో విరుచుకుపడ్డారు. శనివారం నిర్మల్‌లో సర్వేచేస్తున్న ఆశ కార్యకర్తలను అడ్డుకొన్నారు. అయినా వైరస్‌సోకితే కలిగే అనర్థాలను వివరిస్తూ, లక్షణాలున్నవారు దవాఖానకు వచ్చేలా చేయడంలో ఈ బృందాలు సఫలీకృతమవుతున్నాయి.

ట్రాకింగ్‌.. ట్రేసింగ్‌ చేసేదిలా!

కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి ఫోన్‌నంబర్‌ను సర్వైలైన్స్‌ బృంద సభ్యులు సేకరిస్తారు. ఓ వైపు వైద్యచికిత్స అందిస్తూనే ఏరోజు, ఎక్కడ ఈ వ్యాధి సోకిందో ఆరాతీస్తారు. పాజిటివ్‌గా మారడానికి 14 రోజుల ముందు ఎక్కడికి వెళ్లారు? వ్యాధి స్థానికంగా సంక్రమించిందా? ఇతరచోట్ల నుంచి సంక్రమించిందో అంచనా వేస్తారు. ఆ వ్యక్తి విదేశాల నుంచివస్తే, ఏ రోజు వచ్చారు. స్వస్థలానికి వచ్చేలోపు ఎవరెవరిని కలిశారు? ఏ వాహనంలో ప్రయాణించారో తెలుసుకుంటారు. ఇంటికి వచ్చాక ఎక్కడెక్కడ తిరిగారో, ఎవరితో సన్నిహితంగా మెలిగారో గుర్తిస్తారు. ఆయా వాహనాల్లో ప్రయాణించినవారిని అప్రమత్తం చేసి 14 రోజులపాటు స్వీయనిర్బంధంలో ఉండాలని సూచిస్తారు. పాజిటివ్‌ రోగులు ప్రత్యక్షంగా ఎవరిని కలిశారో, వారికి ఫోన్లుచేసి సమాచారం సేకరిస్తారు. నిత్యం ఐదువేలకుపైగా ఫోన్లు చేస్తున్నారు.

మర్కజ్‌ లింకును గుర్తించింది మనవాళ్లే

కరీంనగర్‌లో పర్యటించిన తొమ్మిది మంది ఇండోనేషియా దేశస్థులకు కరోనా వైరస్‌ సోకినట్టు గుర్తించగానే సర్వైలెన్స్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ఇండోనేషియా దేశస్థులకు ఉర్దూ, ఇంగ్లిష్‌, హిందీ భాషలేవి రావు. వీరితోపాటు వైరస్‌ సోకిన స్థానికుడికి ఇండోనేషియా భాష రావడంతో అతనినుంచి సర్వైలైన్స్‌ బృం దాలు సమాచారం సేకరించాయి. కరీంనగర్‌ రాకముందు ఎక్కడున్నారు? ఢిల్లీ నుంచి ఏ రైలులో రామగుండం వచ్చా రు? అక్కడినుంచి ఆటోలో కరీంనగర్‌ వచ్చిన సమాచారాన్ని కూడా సేకరించారు. స్థానికంగా ఏయే ప్రాంతాల్లో సంచరించారనే విషయాలను ఆరాతీశారు. ఈ క్రమంలోనే ఢిల్లీ మర్కజ్‌ లింకు బయటపడింది. ఆ వెంటనే కేంద్రప్రభుత్వాన్ని రాష్ట్రప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇండోనేషియా దేశస్థులు పర్యటించిన ప్రాంతాల్లో ఎవరెవరిని కలిశారో ఆరాతీసి క్వారంటైన్‌ చేయడంలో సర్వైలైన్స్‌ బృందాలు కీలకంగా పనిచేశాయి.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *