హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): ఉత్తరప్రదేశ్‌లోని దేవ్బంద్లో జరిగిన జాతీయ మదర్సా సమ్మేళనానికి వెళ్లివచ్చిన ఇద్దరు తెలంగాణవాసులకు కరోనా రావడంతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్లి వచ్చిన వారందరినీ గాలించే పనిలో పడింది. దేవ్‌బంద్ మదర్సా కార్యక్రమంలో రాష్ట్రం నుంచి 100 మంది లోపు పాల్గొన్నట్లు తెలుస్తోంది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటికే కొంతమందిని గుర్తించగా, మిగతా వారి ఆచూకీని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. శుక్రవారం నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ రాగా, వారు దేవ్‌బంద్ మదర్సా సమ్మేళనానికి వెళ్లి వచ్చినట్లు తేలింది.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]