[spt-posts-ticker]

ఆయుర్వేద ఆహార నియమాల్ని పాటిద్దాం.. కరోనాని అడ్డుకుందాం

కంటికి కనిపించని శత్రువు.. కరోనా వైరస్. మనిషి మనుగడపైనే దాడి చేస్తున్న ఆ వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మన ముందున్న ఆయుధం.. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం. రోగ నిరోధక శక్తిని పెంచి, వైరస్ ల  నుంచి మనను రక్షించడంలో ఆయుర్వేదం ఎంతగానో తోడ్పడుతుందని హెల్త్ ఎక్స్ పర్ట్స్  చెబుతున్నారు . ప్రధాని మోడీ సైతం ఇటీవల ఇదే సలహా ఇచ్చారు . ఆయుష్ మంత్రిత్వ శాఖ కొన్ని సూచనలు కూడా విడుదల చేసింది. మన ఇంటి గుమ్మంలో ఉండే తులసితో పాటు పసుపు,లవంగం, మిరియాలు, శొంఠి, కిస్మిస్ , నిమ్మ, ఉసిరి వంటివి కరోనా కట్టడికి సహకరిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. వంటకాల్లో పసుపు, జీలకర్ర, ధనియాలు, ఎల్లి గడ్డను వాడాలని సూచిస్తున్నారు . రెగ్యులర్ గా యోగా, ధ్యానం చేయడంతో కూడా మన దేహంలో ఇమ్యునిటీ పవర్ పెరుగుతుందని, మానసిక ప్రశాంతత ఉంటుందని చెబుతున్నారు . ‘‘దేశాన్ని వైరస్ ల బారి నుంచి కాపాడేది ఇమ్యూనిటీ పవరే. దాన్ని పెంపొందించడంలో ఆయుర్వేదం ఎంతో ఉపయోగ పడుతుంది. కరోనా బాధితులూ ఇమ్యూనిటీని పెంచే ఆహారం తీసుకోవాలి”అని ఏఐఎంఐఎల్ ఫార్మా ఈడీ సంచిత శర్మ సూచించారు. వైరస్లను ఎదుర్కొనేం దుకు అవసరమైన ఇంట ర్ఫెరాన్స్ (ప్రొటీన్ల)ను, యాంటీ బాడీస్ ను  ఆయుర్వేద మూలికలు పెంపొందిస్తాయని సీఎస్ఐఆర్ మాజీ సైంటిస్టు ఏకేఎస్ రా వత్ చెప్పారు. ‘‘శత్రువును ఎదుర్కొనేందుకు మన దగ్గ ర ఆయుధం లేనప్పుడు మనోధైర్యమే ఆయుధమవుతుంది. కరోనాకు మందులేదు. దాన్ని ఎదుర్కోవడానికి మనదగ్గరున్న ఆయుధం రోగ నిరోధక శక్తిని పెంచు కోవడమే.ఆయుర్వేదంలో ఆశక్తి ఉంది”అన్నారు .

తులసీ.. ఆరోగ్యప్రదాయని

తులసి మొక్క ఇంటి ముందుంటే ఎలాంటి క్రిమికీ టకాలు దరిదాపుల్లోకి రావని పెద్దలు చెబుతుంటారు. రోజూ 2, 3 తులసి ఆకులను తింటే రోగాలు మటుమాయమవుతాయని అంటుంటారు . తులసి ఆకులతోపాటు వేర్లు, విత్తనాల్లోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.  తులసీ దళాలను నీటిలో వేస్తే ఆ నీటిలోని సూక్ష్మ క్రిములు నాశనమవుతాయని అంటున్నారు .జలుబు, దగ్గు, గొంతునొప్పి ఉన్నప్పుడు 2,3తులసి ఆకులను నమలడం కానీ.. రసాన్ని తేనెతోకలిపి తాగడం కాని చేయాలని,దానివల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుందని హెల్త్ ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు.

లవంగం, మిరియంతో ఇమ్యూనిటీ

లవంగం, మి రియాలు, సొంటి, కిస్మిస్ వంటి వి కూడా కరోనా నుంచి మనల్ని కాపాడుకోవడానికి తోడ్పడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు . వీటిని ఆహారంలో కానీ.. విడిగా కానీ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇమ్యూనిటీని పెంచే గుణం వీటికి ఉందనిఅంటున్నారు . ఉసిరితో రూపొందించే చవన్ ప్రాష్ను రోజూ ఉదయం 10 గ్రాములు తీసుకుంటే మేలని సలహా ఇస్తున్నారు .

ఒంటికి యోగా మంచిదేగా

రెగ్యులర్గా యోగ చేయడంతో,యోగాసనాలు వేస్తే శరీరం ఫిట్గా ఉంటుందని, దీంతోఎలాంటి రోగాలు మనదరి చేరవని, ఒకవేళ చేరినా.. వాటి నుంచి తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ ర్ట్ సూచిస్తున్నారు . రోజూ కనీసం 30 నిమిషాలపాటు ప్రాణాయామం, ధ్యానం చేయండని ఇటీవల ఆయుష్ మినిస్ట్రీ కూడా సూచించింది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *