[spt-posts-ticker]

ఆయుష్‌పై ప్రజల్లో విస్తృత ప్రచారం

 

అనంతపురం ((ఆరోగ్యజ్యోతి)‘హోమియో.. ఆయుర్వేదం.. యునాని.. ప్రకృతి.. వంటి దేశీయ వైద్య విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ప్రస్తుతం విపరీతమైన వ్యాధులు జనాన్ని పీడిస్తున్నాయి. వీటి నియంత్రణ ఒక్క ఆయుష్‌ వైద్య చికిత్సతోనే సాధ్యం. ఇప్పుడిప్పుడే ఆయుష్‌ శాఖపై ప్రజల్లో ఆదరణ లభిస్తోంది. కాలానుగుణ వ్యాధుల నియంత్రణపై తగిన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని’ రాష్ట్ర ప్రభుత్వ ఆయుష్‌ శాఖ కడప ప్రాంతీయ ఉప సంచాలకుడు (ఆర్డీడీ) డాక్టర్‌ కేవీ కుమార్‌బాబు పేర్కొన్నారు. శనివారం అనంత రెవెన్యూ భవన్‌లో ఆయుష్‌ శాఖ వైద్యాధికారులకు ఒక్కరోజు కార్యశాల జరిగింది. ఆర్డీడీ మాట్లాడుతూ, వివిధ వైద్య విధానాల్లో నూతన ఆవిష్కరణలను అవగతం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు పరిశోధనలు, అధ్యయనం చేయాలి. జబ్బులు నయం చేసేందుకు ఏం చేస్తే బాగుంటుందో విశ్లేషించుకోవాలని సూచించారు. ఆయుర్వేద, హోమియో విభాగాల సబ్‌ కంట్రోల్‌ అధికారులు డాక్టర్‌ నాగేశ్వర్‌రావు, డాక్టర్‌ తిరుపతినాయుడు మాట్లాడుతూ, స్వైన్‌ఫ్లూ, డెంగీ, కరోనా వైరస్‌, మెదడువాపు.. వంటి ప్రమాదకర జబ్బుల బారిన పడకుండా ముందస్తు ఔషధాలు ఇస్తున్నామని చెప్పారు. సదస్సులో కడప హోమియో వైద్యశాల ప్రొఫెసర్‌ సాంబమూర్తి, గుంతకల్లు ఆయుర్వేద వైద్యశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అశోక్‌వర్ధన్‌, విజయవాడ వైద్యుడు మహమ్మద్‌, తదితరులు వివిధ అంశాలను వివరించారు. జిల్లాలోని ఆయుష్‌ వైద్యాధికారులు పాల్గొన్నారు.

 

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *