[spt-posts-ticker]

ఆయుష్‌ ఎస్సీ, ఎస్టీ అధికారుల ప్రమోషన్లలో అన్యాయం : మురళీధర్‌రావు

ఖైరతాబాద్‌ : ఆయుష్‌ విభాగంలో ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్లకు ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని అఖిల భారత షెడ్యూల్డ్‌ కులాల, తెగల హక్కుల పరిరక్షణ సంఘం డిమాండ్‌ చేసింది. ఆదివారం ఖైరతాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లో విలేకరుల సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షుడు మురళీధర్‌రావు, తదితరులు మాట్లాడారు. ఆయూష్‌ విభాగంలో 1998లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసి 1999లో పోస్టింగ్‌ ఆర్డర్‌లను ఇచ్చారని, ఇందులో ముందుగా బ్యాక్‌లాగ్‌ అనంతరం మెరిట్‌ ఆర్డర్‌ పద్ధతిలో ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉండగా దానికి విరుద్ధంగా నియామకాలను చేపట్టారని పేర్కొన్నారు.

దీంతో ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్లకు తీవ్ర అన్యాయం జరిగిన విషయాన్ని 2006, 2010లలో ఆయూష్‌ కమిషనర్లుగా ఉన్న డీఆర్‌ గార్గ్‌, డాక్టర్‌ విజయ్‌కుమార్‌ గుర్తించారని తెలిపారు. దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వారికి అనుకూలంగా ఉండేలా జీవో నెంబర్‌ 89ని జారీ చేయించారని, దాని ప్రకారం 2013లో సీనియారిటీ లిస్ట్‌ను విడుదల చేశారని తెలిపారు. ఈ లిస్టును సవాలు చేస్తూ ఆయూష్‌ విభాగం ఎస్సీ, ఎస్టీ అధికారులు తమకు జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయించగా హైకోర్టు 2014లో జీవో నెంబర్‌ 89ని రద్దు చేయాలని సూచిస్తూ.. 2010లో ఇచ్చిన సీనియారిటీ లిస్ట్‌ను కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *