విశాఖపట్నం,(ఆరోగ్యజ్యోతి) : కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎ్సఐసీ) సోమవారం కోరమాండల్ ఇంటర్నేషనల్లో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, కార్మికులకు వైద్య సేవలందించింది. ఈఎ్సఐసీ 68వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం నుంచి వచ్చేనెల పదో తేదీ వరకు వివిధ పరిశ్రమల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగానే కోరమాండల్ ఇంటర్నేషనల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫ్యాక్టరీస్ విభాగం, బీమా వైద్యసేవల విభాగం, లేబర్, బాయిలర్ల విభాగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాయి. కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాలను 15 రోజుల పాటు వివిధ కార్మాగారాల్లో, సంస్థల్లో నిర్వహిస్తామన్నారు. మెడికల్ క్యాంప్ నిర్వహించేందుకు సహకరించిన కోరమాండల్ ఇంటర్నేషనల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఈఎ్సఐసీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమీల, ఈఎ్సఐసీ అసిస్టెంట్ డైరక్టర్ ప్రదీప్ బెహరా, ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీరామ్ పట్నాయక్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ లక్ష్మీనారాయణ, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్లు విజయకుమార్, కోరమాండల్ ఇంటర్నేషనల్ సీనియర్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) కె.రంగకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 500 మంది కార్మికులు పాల్గొన్నారు. బేసిక్ స్ర్కీనింగ్, ఈసీజీ, బీపీ, డాక్టర్ కన్సల్టేషన్ వంటి సేవలు అందుబాటులో ఉంచారు. కార్మికులు వీటిని ఉపయోగించుకున్నారు. 20 మంది వైద్యులు, 30 మంది పారామెడికల్ సిబ్బంది ఇందులో వైద్య సేవలందించారు.

ఆరోగ్యంపై అవగాహన, వైద్య సేవలు
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]