అనంతపురం (ఆరోగ్యజ్యోతి): బస్సు, లారీ డ్రైవర్లు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని రవాణా శాఖ ఉప కమిషనర్ శివరాం ప్రసాద్ పేర్కొన్నారు. జాతీయ రహదారి వారోత్సవాల సందర్భంగా మంగళవారం రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో సురక్షిత ప్రయాణం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీటీసీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యమే మహా భాగ్యమనీ, మనం రోజువారీ విధులతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతకు ప్రమాద రహిత జిల్లాగా పేరు తేవాలని కోరారు. వైద్యులు శివశంకర్ మాట్లాడుతూ, ప్రతి డ్రైవరు ఏడాదికోసారి వైద్యుడి దగ్గరకు వెళ్లి ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని సూచించారు. నగర ట్రాఫిక్ ఇన్స్పెపెక్టరు నాగరాజు, అధికారులు వరప్రసాద్, దామోదరనాయుడు, అతికానాజ్, బీవీ ప్రసాద్, ఇస్మాయిల్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. చోదకులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించారు. శ్రీరామ ఫైనాన్స్ సంస్థ ఉచితంగా మందులు పంపిణీ చేసింది.
ఆరోగ్యమే… మహాభాగ్యం
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]