[spt-posts-ticker]

ఆరోగ్యశ్రీ రోగులకు నిమ్స్‌ షాక్

నిమ్స్‌లో వైద్య సేవలకు 25 శాతం చెల్లించాల్సిందే..

హైదరాబాద్‌ (ఆరోగ్యజ్యోతి) ‌: నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ రోగులకు ఓపి సేవల్లో కోతలు విధించారు అవుట్ పేషెంట్ సేవలు వినియోగించుకుంటే 25 శాతం మేరకు ఖర్చులు భరించాలని ఆదేశాలను జారీ చేశారు సోమవారం నుంచి ఈ ఆదేశాలను అమలులోకి తీసుకు వచ్చారు. ఇప్పటి వరకు ఆస్పత్రిలో 2 వేల రూపాయల వరకు రాయితీ కల్పిస్తున్నారు. ఇక మీదట ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం అర్హులైన రోగులకు వైద్య సేవలను అందించేందుకు యాజమాన్యం సమాయత్తమైంది. ఆస్పత్రి ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో ఓపీ సేవల్లో రాయితీలలో కోత విధించినట్టు సమాచారం. కోవిడ్‌–19 నేపథ్యంలో నిమ్స్‌లో కూడా ఉద్యోగులకు జీతాలను చెల్లించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా నిమ్స్‌ ఆస్పత్రికి ఈ ఆరు నెలల్లో రూ. 50 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. సాధారణంగా నిమ్స్‌కు రోగుల నుంచి క్యాష్‌ కలెక్షన్స్‌ ద్వారా నెలకు రూ.8.5 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఆస్పత్రికి రూ. 2.5 కోట్ల వరకే ఆదాయం లభించింది. కాగా ఆస్పత్రి ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను చక్కదిద్దేందుకు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామని నిమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. ఆస్పత్రిలో క్యాష్‌ కలెక్షన్స్‌ గణనీయంగా పడిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. దీంతో ఆరోగ్యశ్రీ ఓపీ సేవల్లో గతంలో వర్తింపచేసిన నిబంధనలనే అనుసరిస్తున్నామన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *