– చైర్మన్, తెలంగాణ వైద్య, ప్రజారోగ్య ఐక్య కార్యాచరణ సమితి (TMPH JAC)డాక్టర్ రవి శంకర్
మన దేశంలోకి బొప్పాయి (Papaya) 400 ఏళ్ల క్రితమే ప్రవేశించింది. మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది. మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. బొప్పాయి తక్కువ కాలంలో కోతకు వచ్చే ముఖ్యమైన పండ్లతోట. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో పరందపుకాయ, పరమాత్ముని కాయ, మదన ఆనపకాయ అని అని కూడా బొప్పాయిని పిలుస్తుంటారు.బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు డాక్టర్ రవి శంకర్ తెలిపినారు. బొప్పాయి గురించి అయన మాటల్లోనే విందాం….. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు. ఇందులో విటమిన్ “ఏ”, విటమిన్ “బీ”, విటమిన్ “సీ”, విటమిన్ “డీ”లు తగుమోతాదులోనున్నాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయన్నారు. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే. ఆ జబ్బులను మటుమాయం చేసేందుకు తరచూ బొప్పాయి పండును ఆహారంగా సేవించాలంటున్నారు. ఉదరంలోని పేగులు శుభ్రమైతే శరీరం పూర్తిగా శుభ్రంగానున్నట్లే లెక్క. దీంతో శరీరం ఉల్లాసంగా తయారై తనపని తాను చేసుకుంటూ పోతుంటుందని డాక్టర్ రవి శంకర్ తెలిపినారు.
పోషక విలువలు
-
కెరోటిన్, ఎ, బి, సి, ఇ విటమిన్లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్లు, ఫొలేట్లు, పాంతోనిక్ ఆమ్లాలు, పీచు.వంటి పోషకాలు[1]బొప్పాయిపండులో పుష్కలం.
-
మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలోవిటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి.
-
కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్ (2020 ఐ.యూ.) తోడ్పడుతుంది.
-
బొప్పాయిలో సమృద్ధిగా లభించేవిటమిన్ సి (40 మి.గ్రా.) దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది.
-
విటమిన్ బి (రైబోఫ్లెవిన్ 250 మైక్రోగాములు)నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది.
-
బొప్పాయి ‘కాయ’ జీర్ణానికి తోడ్పడితే, ‘పండు’ పోషకాలనిస్తుంది.
-
బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెలనుంచి తినిపించవచ్చు. యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు.
-
100 గ్రాముల బొప్పాయి ముక్కల్లో లభించేవి
40 క్యాలరీలు
8గ్రా. పీచు
9.8గ్రా కార్బోహైడ్రేట్లు
0.6గ్రా ప్రోటీన్లు
10మి.గ్రా. మెగ్నీషియం
257మి.గ్రా. పొటాషియం
3 మి.గ్రా. సోడియం
24మి.గ్రా. కాల్షియం
61.8 మి.గ్రా. విటమిన్-సి
విటమిన్ ఎ (6%)
బీటా కెరోటిన్ (3%)
విటమిన్ బి1 (3%)
బి2 (3%)
బి3 (2%)
బి6 (8%)
-
కొలెస్ట్రాల్ అంటే కొవ్వు లేదు
-
క్యాలరీలూ తక్కువే
-
అందుకే స్థూలకాయులు సైతం హాయిగా బొప్పాయిని తినొచ్చు
అపోహలు
బొప్పాయి పండ్ల వినియోగంపై గ్రామీణ, పట్టణ వాసులకు కూడా అనేక అపోహలున్నాయి. బొప్పాయి తింటే వేడి చేస్తుందని, గర్భిణి స్త్రీకి గర్భస్రావం అవుతుందని, పాలిచ్చే తల్లి తింటే బిడ్డకు అజీర్తి చేస్తుందని, బహిస్టు సమయంలో స్త్రీలు తింటే రక్తస్రావం ఎక్కువ అవుతుందని, ముసలివారికి, పిల్లలకు అజీర్ణం చేస్తుందని ఇలా ఎన్నో అపోహలున్నాయి. వీటిలో నిజం లేదని శాస్త్రీయంగా రుజువయ్యింది. అంతేకాకుండా బొప్పాయిలో లభ్యమయ్యే అనేక పోషకాలు మన ఆరోగ్య పరిరక్షణకు చాలా అవసరం.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]