[spt-posts-ticker]

ఆరోగ్య తెలంగాణకు పాటుపడాలి: ఈటల

 

హైదరాబాద్‌ (ఆరోగ్యజ్యోతి) : పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య సిబ్బంది, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, ఆరోగ్య తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు.  మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం వైద్య ఆరోగ్య గెజిటెడ్‌ అధికారుల సంఘం నూతన సంవత్సర డైరీని ఈటల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూపల్లి రాజేందర్‌, కార్యదర్శి కలీముద్దీన్‌, సహ అధ్యక్షుడు రామాంజనేయులు, కోశాధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

* జాతీయ ఆరోగ్య మిషన్‌ పథకాల కింద ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేస్తున్న స్టాఫ్‌ నర్సులకు వేతనాలను నిబంధనలకు లోబడి అందజేయాలనీ తెలంగాణ నర్సింగ్‌ సమితి ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసింది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *