ఖమ్మం,(ఆరోగ్యజ్యోతి): వ్యక్తిగత పరిశుభ్రత పాటించి మనమంతా ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకుందామని టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు, 16వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి, జిల్లా విద్యాశాఖాధికారి మదన్మోహన్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ బి. మాలతి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా ఆల్బెండజోల్ మాత్రలను మింగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1-19 సంవత్సరాల పిల్లలకు నులిపురుగులను నివారించేందుకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయడం జరిగిందని వారన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిస్తూ భోజనం భుజించేటప్పుడు చేతులను పరిశుభ్రంగా కడుగాలని, చేతి వేలి గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించినప్పుడే వ్యాధులు దరిచేరవని వారన్నారు. పిల్లలందరూ మాత్రలు మింగడం వల్ల రక్తహీనత బారిన పడకుండా ఉంటారని, అదేవిధంగా బహిరంగ మల విసర్జన చేయకుండా ఉంటేనే నులిపురుగుల వ్యాధి బారిన పడకుండా ఉంటారన్నారు. ఖమ్మం జిల్లాలో మిషన్నారీ కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికి హిమోగ్లోబిన్ శాత రక్తపరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. తొలుత పాఠశాల విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నృత్యప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఐవో డాక్టర్ అలివేలు, ఏఎంవో పాషా, కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి, హెడ్మాస్టర్ కృష్ణకుమారి, కార్యక్రమ రాష్ట్ర పరిశీలకులు శ్రీనివాస్, డాక్టర్ ప్రమీల, డీపీహెచ్ఎన్వో విమల, ఎస్డీపీవో నీలోహన, డిప్యూటీ డెమో సాంబశివారెడ్డి తదితరులున్నారు.

ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం..
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]