[spt-posts-ticker]

ఆవు మూత్రం, పేడతో కోవిడ్-19 హుష్‌కాకి.

గౌహతి:  ప్రపంచ వ్యాప్తంగా 3,000 మందిని మృత్యువాత పడేసిన కోవిడ్-19 (కరోనా)కు విరుగుడు కనుగొనేందుకు అందరూ మల్లగుల్లాలు పడుతుంటే అసోం బీజేపీ ఎమ్మెల్యే ఒకరు దీనికి తరుణోపాయం సూచించారు. ఈ వైరస్‌ ట్రీట్‌మెంట్‌కు గోవు మూత్రం, గోవు పేడ వాడొచ్చని శాసనసభ్యురాలు సుమన్ హరిప్రియ అసెంబ్లీలో ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తొలిరోజు బంగ్లాదేశ్‌కు అక్రమంగా పశువుల స్మగ్లింగ్‌పై చర్చ సందర్భంగా సుమన్ హరిప్రియ మాట్లాడుతూ, ఆవు పేడ ఉపయోగాల గురించి అందరికీ తెలుసునని, అలాగే ఆవు మూత్రం పిచికారీ చేస్తే ఆ ప్రాంతం పరిశుద్ధమవుతుందని అన్నారు. ఆవు పేడ, ఆవు మూత్రంతో కరోనా వైరస్‌ను కూడా తరిమికొట్టవచ్చని తాను బలంగా నమ్ముతున్నానని అన్నారు. గుజరాత్‌‌లో ఏకంగా ఓ ఆయుర్వేద ఆసుపత్రుల్లో గోశాలల్లో గోవులతో కలిసి పేషెంట్లు ఉండేందుకు అనుమతిస్తున్నారని, ఆవు పేడను కేన్సర్ పేషెంట్ల మందులకు వాడుతున్నారని చెప్పారు. ఆవు మూత్రంతో పంచమూత్ర తయారు చేసి ఇస్తున్నారని అన్నారు.

చైనాలోని వ్యూహాన్ నరగంలో తొలుత కనిపించిన కోవిడ్-19 ప్రస్తుతం 50పైగా దేశాలకు విస్తరించింది. అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది కూడా. ఇంతవరకూ 3,000 మందికి పైగా ఈ వైరస్‌ బారిన పడి మృతి చెందగా, 90,000 మందికి పైగా వ్యాధి సోకినట్టు అధికార గణాంకాలు చెబుతున్నాయి. ఇండియాలో మూడు కోవిడ్-19 కేసులు ఢిల్లీ, తెలంగాణ, జైపూర్‌లో గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారంనాడు ధ్రువీకరించింది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *