చింతకాని: చింతకాని ప్రాథమిక వైద్యశాలలో ఆశా కార్యకర్తలకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కరోనా వైరస్, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మండల వైద్యాధికారి డాక్టర్ నాగేశ్వరరావు సూచించారు. మండల వ్యాప్తంగా ఉన్న 10 ఆరోగ్య ఉపకేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వేసే టీకాల గురించి ఆయన చర్చించారు. ఈ సదస్సులో ఆరోగ్య పర్యవేక్షులు జైపాల్, ఏఎన్ఎమ్లు నర్సమ్మ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]