[spt-posts-ticker]

ఆసుపత్రిలో నృత్యాల ఘటనపై విచారణ

 

ఏలూరు  (ఆరోగ్యజ్యోతి): జిల్లా కేంద్రం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది నృత్యాలు చేసిన ఘటనపై జేసీ-2 తేజ్‌భరత్‌ మంగళవారం పలువురిని విచారించారు. డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయంలో ఆయన నాటి ఆసుపత్రి పర్యవేక్షకుడు ఏవీఆర్‌ మోహన్‌ను అనంతరం హెడ్‌ నర్స్‌ శాంతకుమారి, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, కొందరు నర్సులు, నర్సింగ్‌ స్కూల్‌ విద్యార్థినులను విచారణ చేశారు. డీసీహెచ్‌ఎస్‌ శంకరరావును ఆ రోజు జరిగిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘటన జరిగిన సమావేశ మందిరాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి సమీపంలో ఉన్న ఆరోగ్యశ్రీ వార్డుకు వెళ్లి అప్పటి నుంచి చికిత్సపొందుతున్న రోగులతో మాట్లాడారు.. విచారణ చేసిన అంశాలన్నీ పొందుపరిచారు. ఫార్మసీ విభాగాన్ని మరింత పునరుద్ధరించి త్వరితగతిన మందులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డీసీహెచ్‌ఎస్‌ శంకరరావును ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశించడంతో విచారించేందుకు వచ్చి అన్ని విషయాలను పరిశీలించానని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తానని.. తదుపరి చర్యలు ఆయన తీసుకుంటారని వెల్లడించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *