[spt-posts-ticker]

ఆసుపత్రిలో పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి ఉస్మానియా సూపరింటెండెంట్‌ డా.నాగేందర్‌

ఉస్మానియా : కరోనా నేపథ్యంలో వైద్యసిబ్బంది.. రోగులకు సత్వర వైద్యసేవలు అందించాలని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.నాగేందర్‌ పేర్కొన్నారు. ఆదివారం సెలవుదినమైనప్పటికీ ఆయన ఆసుపత్రిలోని అత్యవసర వార్డుల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రోగులకు అందజేస్తున్న వైద్యసేవలపై సమీక్షించారు. తొలుత క్యాజువాల్టీకి వెళ్లి వైద్యాధికారులు ప్రణతి, లక్ష్మణ్‌కు పలు సూచనలు ఇచ్చారు. అత్యవసర స్థితిలో చికిత్స నిమిత్తం వచ్చే రోగులు, క్షతగాత్రులకు సత్వరమే అవసరమైన రోగ నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. వైద్యులు తప్పనిసరిగా ఏప్రాన్‌లు, మాస్కులు ధరించాలన్నారు. రోగులతోపాటు వారి సహాయకులకూ పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని వివరించారు. వెంటిలేటర్లు, బీపీ ఆపరేటర్లను పరిశీలించారు. డ్యూటీ ఆర్‌ఎంవో డా.సిద్ధిఖి తదితరులు ఆయన వెంట ఉన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *