కరీంనగర్ : జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని బాత్రూంలో శుక్రవారం ఓ మహిళ ప్రసవించిన సంఘటన చోటుచేసుకుంది. సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా మేడారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన వనితను ప్రసవం కోసం కుటుంబ సభ్యులు గురువారం జిల్లా ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు.
వనితకు మొదటి కాన్పు కావడంతో సాధారణ కాన్పు కోసం వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు. శుక్రవారం రాత్రి బాత్రూంకు వెళ్లిన ఆమె అక్కడే బాబుకు జన్మనిచ్చింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు కూడా ఆమె వెంటలేరు. దీనితో సిబ్బంది గమనించి తల్లీబిడ్డను బెడ్‌పైకి చేర్చారు. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్‌కుమార్ తెలిపారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]