[spt-posts-ticker]

ఆహారం

ఆహారం (Food) జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలుమాంసకృత్తులుకొవ్వుపదార్ధాలుఖనిజలవణాలుపీచుపదార్ధాలురోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు, శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీటీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

ఆహారం ఆధారాలు

ఆహారం కోసం మొక్కల మీద ఆధార పడినా మాంసాహారం తీసుకొనే అలవాటు చాలామంది మనుష్యులలో ఉంది. చాలావరకు ఆహారం మొక్కలు, జంతువులూ అందిస్తాయి. మొక్కల ఆకులూ, పూలూ, కాయలూ, గింజలూ, పండ్లూ అన్నీ ఆహారంగా ఉపకరించేవే. ఇవికాక జంతువుల మాంసం, పక్షులగుడ్లు, పక్షుల మాంసం, చేపలు మొదలైన నీటి జంతువులను నేరుగాను, పాలుపెరుగునెయ్యి మొదలైనవి పాడి చేయడం ద్వారాను లభిస్తుంటాయి.

శాకాహారం

మొక్కలనుండి లభించే ఆహారం.2000 జాతుల వరకు పంటల రూపంలో వివిధ దేశాలలో వివిధ కర్షకులు ఆహారం కోసం పండిస్తున్నారు. చాలావరకు గింజలు వివిధ రూపాలలో ఆహారంగా ఉపయోగపడతాయి. కారణం చెట్లకు మొలక దశలో కావలసిన ఆహాం విత్తనాలలో సంక్షిప్తం అయి ఉంటుంది కనుక వీటి ఉపయోగం ఆహారంలో ప్రాముఖ్యం సంతరించుకుంది.పిండిపదార్ధాలను అందించే బియ్యముగోదుమలు, ఇతర చిరు ధాన్యాలు, మాంసకృత్తులనందించే కందిపప్పు, మినపప్పు, చెనగబేడలు, పెసలుఅలసందలు మొదలైన పప్పుధాన్యాలు, కొవ్వుపదార్ధాలను అందించే వేరుశనగనువ్వులుకొబ్బరిఆవాలు, పత్తిగంజలు, పొద్దుతిరుగుడుగింజలు మొదలైనవి, మసాలా దినుసులైన జీలకర్ర, సొంపు, గసాలు, దనియాలు, ఇంకా జీడిపప్పు, బాదం, పిస్తా మొదలైన బలవర్దక మైన ఆహారం గింజలనుండి వచ్చినవే.పండ్లు మొక్కలలోని ఆకర్షణీయమైన భాగం వీటి ఆకర్షణలో పడి జంతువులు, పక్షులు పండ్లను తిని గింజలను దూర ప్రాంతాలలో వేస్తాయి కాబట్టి మొక్కల సంతానోత్పత్తి సులభంగా జరుగుతుంది. గుమ్మడి పండు, టమేటా కూరలలోనూ ఉపయోగపడతాయి. పండ్లను వాటి సహజమైన, మధురమైన రుచివలన నేరుగానే ఆహారంగా తీసుకుంటారు. ఇవి జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా రోగనివారణ శక్తిని పెంపొందిస్తుంది.తోటకూరఉల్లిఅరటి మొదలైన కాండములను కూడా ఆహారంగా తీసుకుంటాము. బచ్చలి, చుక్క, గోంగూరతోటకూర మొదలైన ఆకులను ఆహారంగా తీసు కుంటాము.వంకాయబెండకాయకాకరకాయ మొదలైన కాయలను కూరలలో ఎక్కువగా వాడుతూ ఉంటాము.వేరు నుండి వచ్చే ఉర్లగడ్డ, చామగడ్డ, కందగడ్డ మొలైన వాటిని ఆహారంగా ఉపయోగిస్తాము.కాలిఫ్లవర్, కుంకుమపువ్వు, అవిసిపువ్వు, మునగపువ్వు, అరటి పువ్వు అరుదుగా వేపపువ్వు పూలరూపంలో ఆహారంలో ఉపయోగపడతాయి.

మాంసాహారం

జంతువుల నుండి లభించే ఆహారం.క్షీరదాలనుండి పాలను సేకరించి, పాలనుండి అనేక ఇతర ఆహారపదార్ధాలను తయారుచేసి ఆహారలో ఉపయోగిస్తూ ఉంటారు.పెరుగుజున్ను, చీజ్, పనీర్యోగర్ట్వెన్ననెయ్యి మొదలైనవి పాల నుండి తయారు చేసే ఆహారాలు. తేనెటీగలు తయారు చేసే తేనెను ప్రాచీన కాలంనుండి ఆహారంలో చేర్చుకుంటూ ఉన్నారు.జలచరాలను, పక్షులను, పక్షిగుడ్లను, జంతువుల మాంసం, కొన్ని చోట్ల, జంతువుల రక్తం కూడా ఆహారంగా ఉపయోగపడుతుంది.కొన్నితూర్పుఆసియా ఖండంలోని దేశాలైన జపాన్బర్మాలలోలో పాములను, చైనాలో ఎలుకలు ఆహాంగా తీసుకుంటారు.ఉసుళ్ళు మొదలైన కీటకాలను ఆహారలో చేర్చుకోవడం భారతదేశంలో అలవాటే.

సంప్రదాయంలో ఆహారం

అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది హిందూ సంప్రదాయం.దానాలలో శ్రేష్టమైనది అన్నాదానం.ఇవి ఆహారానికి ఉన్న ప్రాధాన్యాన్ని సూచిస్తున్నాయి.పుట్టుక నుండి మరణం వరకు ఆచరించే ప్రతి ఆచారంలోను భోజనానికి ప్రాధాన్యత ఉంది.సంతోష సమయాలలోనే కాక మరణం లాంటి విషాద సమయంలోను విచ్చేసిన బందు మిత్రులకు భోజనం అందించడం విద్యుక్తుదర్మాలలో ఒకటి.వివాహభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటి.అథిధి అభ్యాగతులకు భోజనసదుపాయం చేయడం సంప్రదాయమే.పరిచయస్తులకు కాఫీటీ లనైనా అందిచడం సంప్రదాయమే.జబ్బున పడిన వారిని పలకరించడానికి వెళ్ళేటప్పుడూ, పసిపిల్లను చూడటనికి వెళ్ళేటప్పుడూ, బధి మిత్రులను చూడటానికి వేళ్ళే సమయాలలో పండ్లు మొదలైన ఆహారాన్ని తీసుకు వెళతారు.సత్రాలు కట్టి బాటసారులకు, దేవుని దర్శనానికి వచ్చే భక్తులకూ ఉచిత బోజనాలను అందించడం సంప్రదాయమే.ఆహారాన్ని ప్రసాదంగా అందించడం కోవెల సంప్రదాయాలలో ఒకటి.పశ్చిమ బెంగాల్‌లో బ్రాహ్మణులు చేపలు తింటారు. చేపలను వాళ్లు జలపుష్పాలుగా పరిగణిస్తారు.ఇతర మాంసాహారం ముట్టుకోరు. కాశ్మీర్‌లో బ్రాహ్మణులు మరోరకం పాక్షిక మాంసాహారులు.చాలా చోట్ల శాకాహారులు కోడిగుడ్లను శాకాహారంగా పరిగణించి స్వీకరించడం కనిపిస్తుంది.

ఆహారం ఉత్పత్తి

ఆహారం తోటలు, పైరు మొదలైన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేస్తారు.కబేళాలు, పాడి ప్రిశ్రమ, చేపలు పట్టడం, అడవిలో లభించే వస్తుసేకరణ ద్వారా ఆహారం లభిస్తుంది.వేట కూడా ఒక పద్దతే అయినా అది ఇప్పుడు నిషేధం.వ్యవసాయంలో మిగిలిన గడ్డి తదితరాలు పసువుల మేతగా ఉపయోగ పడుతుంది.

ఆహారం వ్యాపారం

తయారు చేసిన ఆహారాన్ని వినియోగదారులకు అందించడం ఆహారానికి సంబంధిచిన వ్యాపారం. ఇది పూర్వకాలం నుండి ఉంది. అనేక కారణాలచేత మగవారి అండ లేని కుటుంబాలలో ఆడవాళ్ళు తమకు తెసిన వంటనే పిండి వంటలు చేసి అమ్మడం, పూటకూళ్ళు అని ఈరోజులలో మెస్ మాదిరి భోజనాలు వండి భోజనం పెట్టి డబ్బులు తీసుకుంటారు. అవే తరువాత ఫలహారం, కాఫీటీ మొదలైనవి అందించే హోటళ్ళుగా రూపు దాల్చాయి. టీ అంగడి, బడ్డీకొట్టు తినుబండారాలను అమ్ముతూ ఉంటాయి. పానీయాలు, పళ్ళ రసాలు ఇలాచిన్నచిన్న వ్యాపారాలన్నీ ఆహారానికి సంబంధించినవే. మిఠాయి కొట్లు కొంచెం పెద్ద తరహా తినుబండారాల వ్యాపారం. ఈ రోజులలో చిన్న కుటుంబాలు, ఆడవాళ్ళు ఉద్యోగాల కారణంగా అంతగా నిర్భంధం లేక సమయం చాలక ఆహారం ఇళ్ళల్లో చేయడం చాలా తగ్గింది. వడియాలుఅప్పడాలుఊరగాయలు, వరుగులు, పెరుగుఇడ్లీదోశ మొదలైనవి ఇంట్లో తయారు చేసే వస్తువులు ఇప్పుడు వ్యాపార సరళిలో చేసి అమ్మకానికి వస్తున్నాయి. ఆధునిక కాలంలో వీటి రూపు ఇంకామారి తయారు చేసిన వంటకాలు చపాతీలు, పరోటాలు, సైడ్ డిష్ లూ, వివిధ రకాల అన్నాలు గ్రేవీలు, చిప్స్, సీరియల్స్ అనబడే వివిధ సువాసనలతో కలిసిన పదార్ధాలు తాయారీలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఆహారానికి సంబంధించిన వ్యాపారంలో ఉన్నాయి. ఈ రోజులలో ఆహారం వ్యాపారం చాలా పెద్ద వ్యాపార పరిమితి కలిగిన వ్యాపారాలలో ఒకటి.

వివిధ రకాల ఆహారాలు[

 

  • సహజ ఆహారాలు:- పండ్లుపాలు, క్యారెట్, చిలగడ దుంప వంటి దుంపలు, వేరు చనగలు, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరిబాదంజీడిపప్పుపిస్తా, ఆక్రూట్, ఎండు ద్రాక్షఖర్జూరాలుతేనెచెరకు, లేత కొబ్బరి నీళ్ళు మొదలైనవి యధాతతధంగా అలాగే తినగలిగిన ఆహారాలు.
  • నానబెట్టిన ఆహారాలు:- పచ్చి శనగలుపెసలు మొదలైనవి పెసర పప్పు, వీటిని నానిన తరువాత యధాతధంగా తినవచ్చు.
  • మొలకెత్తించిన ధాన్యాలు:- పెసలు, అలసందలు, సజ్జలు, గోధుమలు, జొన్నలు, రాగులు మొదలైన చిరుధాన్యాలు మొలకెత్తించి తినవచ్చు. వీటిని యధాత్ధంగానూ, పచనం చేసి, ఎండబెట్టి పొడి చేసి, కూరలలో ఇతర ఆహారాలలో చేర్చి తినవచ్చు. మొలకెత్తించి ఉపయోగించడం ద్వారా ఆహారపు విలువలు పెరుగుతాయన్నది వైద్యుల

అభిప్రాయం.

  • పచనం చేయకుండా తినగలిన ఆహారాలు:- పచనం చేయకుండా తిన గలిగిన ఆహారాలు రెండు విధాలు ఒకటి నిలువ చేసి సంవత్సరకాలం ఉపయోయించే ఆహారాలు.

రెండు తాత్కాలిక ఆహారాలు.

  • నిలువచేచేసే ఆహారాలు:- వరుగులు అనేక కూరగాయలను విరివిగా దొరికే సమయంలో వాటి ఎండించి నిలువ ఉంచి వాడుకునేవి. వంకాయలు, గోరు చిక్కుళ్ళు, అత్తి కాయలు, బుడ్డ దోసకాయలు మొదలైన వాటిని ముక్కలు చేసి ఎండించి ఆహారంలో వాడు కోవచ్చు. అలాగే ఉత్తర భారత దేశంలో పచ్చి మామిడి ముక్కలను ఎండించి వంటలలో ఆమ్ చూర్ పేరుతో వాడుకుంటారు. పచ్చి మిరపకాయలను ఉప్పులో ఊర వేసి ఉప్పుడు మిరపకాయలు చేసి వేగించి మిగిలిన కూరలతో కలిపి ఆహారంగా వాడుకుంటారు. పచనం చేయకుండా నిలువ ఉండే ఆహారం ఆవకాయ. దీని తయారీకి అన్ని పచ్చిగానే ఉపయోగిస్తారు. ఖర్జూరాలు, చెర్రీ పండ్లు తేనెలో నిలువ చేసి ఆహారంహా వాడుకుంటారు.
  • తాత్కాలిక ఆహారాలు:- వివిధ కూరగాయలతో చేసే పచ్చళ్ళు దోససకాయలు, దొండకాయలు, చింతకాయ పిందెలు, అడవి ఉసిరికాయలు, పచ్చి మామిడి కాయలు పచనం చేయకుండా అలాగే పచ్చళ్ళుగా నూరి ఆహారంలో వాడుకుంటారు. పండ్లరసాలు బత్తాయిమామిడినిమ్మసపోటాఅరటిజామ మొదలైన అనేక పండ్లను పచనం చేయవలసిన అవసరం లేకుండా తేనె లేక పంచదారను చేర్చి పంచదారను చేర్చకుండా తయారు చేయవచ్చు. బత్తాయి లాంటి రసాలు పంచదార చేర్చకుండా సహజసిద్ధంగా తరారు చేసినది లభ్యం ఔతుంది. అలాగే సలాడ్స్ అని చెప్పడేవి. వీటిని వివిధ కూరయాలు లేక పండ్లు ముక్కలు చేసి కొంత మసాలా వేసి అందిస్తుంటారు. కూరకాయలు పండ్లు మిశ్రమం చేసి చేయడం పరిపాటే.
  • ద్రవాహారాలు లేక పానీయాలు:- పండ్ల రసాలు, పానకం, పాలు పండ్లు కలిపి పంచదారను చేర్చి తీసుకునే మిల్క్ షేక్, మజ్జిగ, తరవాణి, చెరకు రసం, షర్బత్ మొదలైనవి.

ద్రవాహారను యధాతధంగానూ శీతలీకరణ చేసి లేక కొంచం అయి ముక్కలను చేర్చి తీసుకుంటారు. అలాగే పాలు చేర్చి లేక పాలు లేకుండా చేసే కాఫీ, టీలు, పాలతో కొన్ని బవర్ధక పదార్ధాలైన హార్లిక్స్, బోర్నవిటా, బూస్ట్, కాంప్లాన్ మొదలైనవి చేర్చివేడిగా తీసుకునేవి.

  • వేగించిన ఆహారాలు:- ఉప్పు చెనగలు, పెసలు, బఠానీలు, పల్లీలుగా పిలువబడే వేరుశనగ పప్పు, వేపిన వేరు శనగ కాయలు మొదలైనవి వేగించిన ఆహారాలు. ఇచి చిరుతిండ్లు అంటారు.
  • ఉడక పెట్టిన ఆహారాలు:- అనేక రకాల పప్పులతో చేసే గుగ్గిళ్ళు, తాటి గింజల నుండి పండించే తేగలు, మొక్క జొన్న పొత్తులు, వేరు చనగకాయలు మొదలైనవి ఉడికించి తినే చిరుతిండి అంటారు.
  • కాల్చిన ఆహారాలు:- పచ్చిగానే కోసి కాల్చిన వేరుచనగ కాయలు, జొన్న, సజ్జ, మొక్కజొన్న మొదలైన పొత్తులు. చిలగడ దుంప లేక గనిసి గడ్డలు.

 

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *