[spt-posts-ticker]

ఆ ఒక్కడితోనే 19 పాజిటివ్‌లు!

వికారాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారందరూ స్వచ్ఛందంగా హోంక్వారంటైన్‌ కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తిని కొందరు పెడచెవిన పెట్టి కరోనా కల్లోలానికి కారణమయ్యారు. అలాంటి వారిలో వికారాబాద్‌కు చెందిన ఓ వ్యక్తీ ఉన్నాడు. పట్టణంలో మంగళవారం కొత్తగా ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19కి చేరింది. కేవలం ఒక్కడి వల్ల  19 మందికి వైరస్‌ సోకినట్లు అధికారులు గుర్తించారు.    పట్టణానికి చెందిన ఓ సంస్థ నిర్వాహకుడు మార్చి 13న మర్కజ్‌కు వెళ్లి అదే నెల 19న తిరిగి వచ్చాడు. ఆ తర్వాత పట్టణంలో పలువురిని కలిశాడు. అనంతరం హైదరాబాద్‌ వెళ్లాడు. అతడికి పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది.అతడు ఎక్కడెక్కడ తిరిగాడు? ఎవరిని కలిశాడనే సమాచారాన్ని రాబట్టడానికి అధికారులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. కానీ, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *