[spt-posts-ticker]

ఆ వ్యాధి లక్షణాలతో భయపడిపోయిన వ్యక్తికి.. నిజమేంటో చెప్పిన డాక్టర్లు

శాన్‌ ఫ్రాన్సిస్కో:టెక్నాలజీ వల్ల లాభాలెన్ని ఉన్నాయో.. నష్టాలూ అన్నే ఉన్నాయి. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో.. ఇప్పుడిప్పుడే టెక్నాలజీని విపరీతంగా వినియోగిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే.. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి, మెడిసిన్‌ల పేర్లు తెలుసుకుని కనీసం డాక్టర్ల సలహా కూడా తీసుకోకుండా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌లో లభించిన సమాచారాన్ని గుడ్డిగా నమ్మకూడదని హెచ్చరించే ఘటన ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో‌కు చెందిన మార్క్ ష్రేబర్ అనే వ్యక్తి.. తన కాళ్లు గత కొన్ని రోజులుగా నీలం రంగులోకి మారడాన్ని గమనించాడు.  దీంతో కంగారు పడిపోయిన ఆయన.. ఓ వెబ్‌సైట్‌ ద్వారా సమస్య ఏంటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. ఆయన సమస్యకు సంబంధించిన లక్షణాలన్నింటినీ వెబ్‌సైట్‌లో నమోదు చేశాడు.

 

నమోదు చేసిన లక్షణాలను బట్టి.. ఆయనకు ‘డీప్ వీన్ త్రాంబోసిస్’ వ్యాధి వచ్చినట్లు ఆ వెబ్‌సైట్ తేల్చేసింది. దీంతో మరింత కంగారుపడ్డ మార్క్ ష్రేబర్.. వైద్యం కోసం డాక్టర్లను సంప్రదించాడు. వైద్య పరీక్షలన్నీ చేసిన తర్వాత ఆయనకు వైద్యులు షాకింగ్ నిజాన్ని చెప్పారు. అతనికి ‘డీప్ వీన్ త్రాంబోసిస్’ లేదని.. కేవలం కొత్తగా కొనుకున్న జీన్స్‌ను వాష్ చేయకుండా అలాగే వేసుకోవడం వల్లే కాళ్లు నీలం రంగులోకి మారాయని తేల్చేశారు. దీంతో ఊపిరిపీల్చున్న మార్క్ ష్రేబర్.. తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *