[spt-posts-ticker]

ఇంటినుంచి కదిలితే కష్టమే…

 

ఆరోగ్యజ్యోతి, (నెట్వర్క్): కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటున్నప్పటికీ.. కొందరు య థేచ్ఛగా బయట తిరుగుతూ ఇతరులకు ప్రమాదకరంగా మారుతున్నారు. ఇలాంటివారిని కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రత్యే క వ్యూహాన్ని సిద్ధంచేశారు. హైదరాబాద్‌ నగరంలో కాల్‌సెంటర్ల ద్వారా హోం క్వారంటైన్‌ అయినవారి సమాచారాన్ని సేకరించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లుచేశారు. జిల్లాల పరిధిలో కమ్యూనిటీ, విలేజ్‌ ఆఫీసర్‌, పోలీస్‌వాచ్‌ పేరిట మూడు దశల్లో నిఘా పెట్టారు. కమ్యూనిటీ వాచ్‌లో హోం క్వారంటైన్‌ అయినవారి ఇండ్ల పక్కన ఉండేవారి ఫోన్‌ నంబర్లను పోలీసులు సేకరిస్తారు. ఎవరైనా హోం క్వారంటైన్‌ నుంచి బయటకు వస్తే సమాచారమివ్వాలని వారికి సూచిస్తున్నారు. విలేజ్‌ ఆఫీసర్‌ పేరిట గ్రామాల్లోని ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వీఏవోలు రోజుకొకసారి హోం క్వారంటైన్‌ అయినవారి ఇండ్లను తనిఖీ చేస్తున్నారు. ఇక పోలీస్‌వాచ్‌లో భాగంగా ఒక ప్రాంతంలోని 15 మంది హోం క్వారంటైన్‌ అయిన వారి ఇండ్లను ఇద్దరు కానిస్టేబుళ్లకు అప్పగించారు. వీరు తమకు అప్పగించిన ఇండ్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ హోం క్వారంటైన్‌ అయినవారిపై నిఘా కొనసాగిస్తున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని కమిషనరేట్లలో కొవిడ్‌-19 ప్రత్యేక కాల్‌సెంటర్లు ఏర్పాటుచేశారు. ఈ కాల్‌సెంటర్లకు ఎలాంటి సమాచారం అందినా పోలీసులు అప్రమత్తం అవుతున్నారు

కరోనా కట్టడిలో సాంకేతికత సాయం

కరోనా వైరస్‌ను లెక్కచేయక తిరుగుతున్నవారిని గుర్తించేందుకు సాంకేతికతను తెలంగాణ పోలీసులు అందిపుచ్చుకొన్నారు. హోం క్వారంటైన్‌ ముద్ర చేతిపై ఉన్నా.. బయటకు కనిపించకుండా తిరుగుతుండటంతో వారిని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. ఇలాంటివారిపై కన్నేసిన పోలీసులు ఇకపై వారు ఇంటి నుంచి బయటికు కాలు కదిపినా తెలిసేలా క్వారంటైన్‌ అయిన 22 వేల మందికిపైగా ఇండ్లను జియో ట్యాగింగ్‌ చేశారు. వీటి వివరాలను టీఎస్‌ కాప్‌ యాప్‌తో జతచేశారు. గస్తీ విధుల్లోని పోలీసులు హోం క్వారంటైన్‌ వారి ఇండ్లను పరిశీలించే సమయంలో పోలీసుల కండ్లు గప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇకపై ఇలా జరుగకుండా ఉండేందుకు హోం క్వారంటైన్‌ అయిన వ్యక్తి మొబైల్‌ ఫోన్‌లో ప్రత్యేక యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి వారు ఎక్కడున్నదీ సులభంగా తెలుసుకోనున్నారు. నిబంధనలు అతిక్రమించి హోం క్వారంటైన్‌ నుంచి బయటకు వచ్చినవారిపై ఐపీసీ సెక్షన్‌ 188, 269, 270, 271 కింద కేసులు నమోదుచేస్తున్నారు. ఈ సెక్షన్ల కింద ఆరు నుంచి రెండేండ్ల వరకు జైలుశిక్ష విధించే వీలున్నది.

కరోనా పోరులో కలిసిరండి

-కాలనీలు, అపార్ట్‌మెంట్‌ సొసైటీలకు డీజీపీ విజ్ఞప్తి

కరోనాపై పోరులో తెలంగాణ పోలీసులతో అంతా కలిసి పనిచేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ట్విట్టర్‌ ద్వారా పిలుపునిచ్చారు. ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్‌ సంఘాలకు ఇద్దరు సభ్యుల చొప్పున జట్టుని ఏర్పాటుచేసుకొని నిఘా పెట్టాలని సూచించారు. ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో ఇబ్బందిపడుతున్న విషయాలను తెలుసుకోని.. అలాంటివారు ఉన్నట్టు తేలితే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లోగానీ, డయల్‌ 100కుగానీ సమాచారమివ్వాలని కోరారు. అత్యవసర పనులపై కాకుండా అనవసరంగా బయటికి వచ్చేవారిని కట్టడిచేసి పోలీసులతో సహకరించాలన్నారు.

హెచ్‌ఎండీఏ పరిధిలోని కాల్‌ సెంటర్లు

హైదరాబాద్‌  – 040-23434343

సైబరాబాద్‌  –   9490617440,  9490617431

రాచకొండ-      9490617234

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *