అవసరమైతే 104 సేవలు పొందండి
మంత్రి కేటీఆర్మంత్రి ఈటల రాజేందర్ ట్వీట్
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): లాక్‌డౌన్‌తో పిల్లలకు టీకాలు వేయించేందుకు అవకాశం లేకుండా పోయిందని ప్రజలుచేస్తున్న అభ్యర్థనపై సర్కారు స్పందించింది. ఏ ఆటంకం లేకుండా టీకాలు వేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నపిల్లలకు టీకా వేయించదలచినవారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ట్విట్టర్ ద్వారా సూచించారు. టీకాల కోసం తల్లి వద్ద ఉండే ఎంసీహెచ్ కార్డు లేదా పిల్లల ఇమ్యునైజేషన్ కార్డును తీసుకెళ్లాలని చెప్పా రు. ఏ బుధవారం అయినా పీహెచ్‌సీకి వెళ్లి టీకాలు వేయించుకోవచ్చని, వచ్చే బుధవారం నుంచి శనివారంవరకు కూడా టీకాలు వేయించేందుకు అనుమతించినట్టు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కూడా ట్వీట్‌చేశారు. అవసరమైతే తల్లిదండ్రులు 104కు ఫోన్‌చేసి సాయం పొందాలని సూచించారు.