జ్యోతినగర్: పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని, మందుల కొరత లేకుండా చూడాలని కోరుతూ ఎన్టీపీసీ ఒప్పంద కార్మికులు, జేఏసీ నాయకులు గురువారం టీటీఎస్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఆస్పత్రికి కేటాయించిన ఇద్దరు వైద్యులను ఈ నెల 13 నుంచి ఇతర ప్రాంతాలకు పంపించారని, వైద్యులు లేక సేవలు నిలిచిపోయాయన్నారు. 20 వేల మందికి అందుబాటులో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రిలో సేవలందక రోగులు వెనుదిరుగుతున్నారన్నారు. వెంటనే సరైన మందులు అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా వైద్యులను నియమించి మెరుగైన సేవలు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆసుపత్రి బాధ్యులకు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ డైరెక్టర్‌కు వినతిపత్రం పంపించారు. కార్యక్రమంలో ఒప్పంద కార్మికులతో పాటు జేఏసీ నాయకులు నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, చిలుక శంకర్, పీఎన్.భూషణం, సీహెచ్.శంకర్, రవి, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
ఈఎస్ఐ ఆస్పత్రి ఎదుట కార్మికుల నిరసన
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]