[spt-posts-ticker]

ఈఎస్‌ఐ నిధుల కేటాయింపుల్లో కేంద్రం వివక్ష

హైదరాబాద్‌: తెలంగాణ నుంచి కార్మికుల జీతాల వాటాలతో పాటు యాజమాన్య వాటా కలిపి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఏటా నిధులు చెల్లిస్తున్నా.. రాష్ట్రానికి నిధుల కేటాయింపులు మాత్రం ఏటేటా తగ్గిపోతున్నాయని సీపీఎం పేర్కొంది. 2014-15లో రాష్ట్రం నుంచి రూ.629 కోట్లు వసూలు చేయగా, 2018-19లో రూ.1257 కోట్లు కేంద్రం వసూలు చేసిందని తెలిపింది. రాష్ట్రానికి ఖర్చు చేసింది మాత్రం 2014-15లో రూ.452 కోట్లు కాగా, 2018-19లో రూ.409 కోట్లేనని పేర్కొంది. ఈఎస్‌ఐకి నిధులు కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపుతోందని రాష్ట్రం నుంచి స్వీకరిస్తున్న ఆదాయానికి తగ్గట్లుగా కేటాయింపులు జరపాలని కోరుతూ సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ నేతృత్వంలో గురువారం కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి శశాంక్‌ గోయల్‌కు వినతిపత్రం అందజేశారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *