గ్రేటర్ నోయిడాలోని అన్ని రకాల ఈత కొలనులను ఏప్రిల్ 15 వరకు మూసివేయాలని నిర్ణయించారు. విద్యాసంస్థలు, హోటళ్లు, సొసైటీలు సహా వేర్వేరు చోట్ల ఉన్న ఈత కొలనులకు ఇది వర్తిస్తుంది.
* కేరళలోని వాణిజ్య సముదాయాలు, బీచ్‌లు, జిమ్‌లపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. విద్యాసంస్థల్ని, సభల్ని ఇప్పటికే రద్దు చేసింది. తిరువనంతపురం శనివారం నిర్మానుష్యమైంది.
* పంజాబ్‌లో సినిమా హాళ్లు, వ్యాయామ శాలలు, ఈత కొలనులు మూసివేయాలని నిర్ణయించారు. సాంస్కృతిక కార్యక్రమాలు సహా బహిరంగ సభలను రద్దు చేశారు.
* గోవాలో క్యాసినోలు, పబ్‌లను ఆదివారం అర్థరాత్రి నుంచి మూసివేస్తారు.
* పార్లమెంటు సముదాయంలోకి సాధారణ సందర్శకులెవరినీ అనుమతించరాదని అధికారులు నిర్ణయించారు. గ్యాలరీల్లోకి, పార్లమెంటును చూడడానికి ఎవరినీ అనుమతించబోరు. ఈ పాసుల కోసం సిఫార్సులు చేయవద్దని లోక్‌సభ సచివాలయం ఎంపీలను కోరింది.
* వీసా అపాయింట్మెంట్లను ఈ నెల 16 నుంచి రద్దు చేయాలని దేశంలోని అమెరికా కాన్సులేట్లు నిర్ణయించాయి.
* ఏసీ ప్రాంగణాల్లో పనిచేస్తున్నవారు కొన్నాళ్లపాటు తమ ఇళ్ల నుంచి పనిచేయాలని కర్ణాటక ప్రభుత్వం చేసిన సూచన మేరకు బెంగళూరులోని ఒక కార్యాలయాన్ని ఇన్ఫోసిస్ ఖాళీ చేయించింది.
* భూటాన్‌తో సరిహద్దును పశ్చిమ బెంగాల్ మూసివేసింది.
* కేరళలో పోలీసుల కన్నుగప్పి తప్పించుకున్న అమెరికన్ దంపతులు కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డారు. వారిని వైద్యుల పరిశీలనకు తరలించారు.
ఈత కొలనులు, వ్యాయామశాలలు సహా అన్నీ మూత
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]