కొవిడ్-19నుంచి తప్పించుకోవాలంటే ఇమ్యూనిటీ అత్యవసరం. దీంతో ఇప్పుడు అందరూ రోగనిరోధక శక్తిని పెంచుకునే పనిలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన ఆహారం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే, ఈ ఐదు పద్ధతులు పాటిస్తే ఇమ్యూనిటీని సహజంగా పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
1. నేలతో కనెక్ట్ అవ్వాలి..
నేలతో.. అందులోని మట్టితో కనెక్ట్ అవ్వాలి. అంటే కనీసం మూడు రోజులకొకసారి అయినా ఇంటివెనుక తోటలో పనిలో నిమగ్నం కావాలి. మట్టితో చాలా ప్రేమగా వ్యవహరించాలి. వేరొకరి తోటలోనైనా స్వచ్ఛందంగా పనిచేయాలి. దీంతో శారీరక, మానసికోల్లాసం కలిగి, ఇమ్యూనిటీ పెరుగుతుంది.
2. ఎక్కువ ఉడికించని ఆహారం తినాలి..
ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన అన్ని పదార్థాలు శరీరంలో మాత్రమే ఉండవు. ఆహారం కొన్ని రకాల ఎంజైమ్లను కూడా తెస్తుంది. ఆహారాన్ని ఉడికించినప్పుడు, ఎక్కువగా ఈ ఎంజైమ్లు నాశనం అవుతాయి. శరీరం నాశనం చేసిన వాటిని పునర్నిర్మించడానికి కష్టపడాలి. అప్పుడే అది జీర్ణమవుతుంది. కాబట్టి 40-50 శాతం ఉడికించని ఆహారం తినడం ఉత్తమం. అంటే పచ్చివి తినాలి.
3. నిద్రపోయే ముందు స్నానం చేయాలి..
రాత్రి పడుకోబోయే ముందు చల్లని లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇది శరీరాన్ని కూల్ చేస్తుంది. స్నానం చేశాక 20-30 నిమిషాల తర్వాత మంచి నిద్ర వస్తుంది. బాగా నిద్రపోతారు. ఎందుకంటే స్నానం చేసేటప్పుడు చర్మంపై ఉన్న ధూళి మాత్రమే కాదు.. టెన్షన్ కూడా తొలగిపోతుంది. శరీరంపై నీరు ప్రవహించినప్పుడు, ఒక నిర్దిష్ట శుద్దీకరణ జరుగుతుంది. మంచినిద్ర రోగనిరోధక శక్తి పెరుగుదలకు సహాయపడుతుంది.
4. స్వచ్ఛమైన నీటిని తాగాలి..
నల్లాలనుంచి వచ్చే నీరు కలుషితమవుతుంది. వాటర్వర్క్ల నుంచి అవి ఇంటికి వచ్చే వరకూ పైపులలో కలుషితమవుతాయి. దీంతో 60 శాతం నీరు విషపూరితంగా మారుతుంది. అందుకే నల్లా నీటిని అలాగే తాగకూడదు. దానిని వాటర్ ఫిల్టర్లోగానీ, రాగిపాత్రలోగాని పోసి శుద్ధి అయిన తర్వాత తీసుకోవాలి. నీటిని తరుచూ తీసుకోవడం మానవద్దు.
5. కడుపుకు విరామం ఇవ్వండి..
ఖాళీ కడుపు.. ఆకలి ఇవి రెండు వేర్వేరు విషయాలు. ఆకలి అంటే మీ శక్తి స్థాయిలు పడిపోవడం అన్నమాట. కానీ ఖాళీ కడుపు అంటే ఒక మంచి విషయం. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే శరీరం, మీ మెదడు ఉత్తమంగా పనిచేస్తాయి. యోగాలో, 2.5 గంటల్లో కడుపు ఖాళీ అయ్యే విధంగా తినే పద్ధతి ఉంటుంది. రెండు భోజనాల మధ్య ఎనిమిది గంటల విరామం ఉండాలి. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలలో కనీసం 50 శాతం ఆరు వారాల వ్యవధిలో తొలగిపోతాయి. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.