[spt-posts-ticker]

ఉల్లిగడ్డతో కరోనా సోకిందో లేదో తెలుసుకోవచ్చా.

– యూకేకి చెందిన మీడియా సంస్థ

ఓ చిన్న టెస్ట్ తో కరోనా వైరస్ సోకిందా లేదా అనే తెలుసుకోవచ్చని అంటున్నారు కరోనా వైరస్ సోకిన బాధితులు. అదెలా అంటారా..? యూకేకి చెందిన మీడియా సంస్థ” సన్ ఆన్ లైన్ ” దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు లేకపోయినా కరోనా సోకిందనే విషయాన్ని తెలుసుకునేందుకు హోం క్వారంటైన్ లో ఉన్న ఓ ఇద్దరిని పరీక్షించగా ఆ పరీక్షలో తమకు కరోనా వైరస్ సోకిందనే విషయాన్నిగుర్తించారు.కొద్దిరోజుల క్రితం బ్రిటీష్ అసోసియేషన్ ఆఫ్ ఈఎన్టీ విభాగానికి చెందిన నిపుణులు కరోనా వైరస్ సోకిన వ్యక్తికి జ్వరం, దగ్గు, జలుబు లేకపోయినా కరోనా వైరస్ సోకిందని గుర్తించవచ్చని తెలిపారు. . కరోనా సోకిన బాధితులు వాసన, రుచిని కోల్పోతారని తెలిపింది. అందుకు ఉదాహరణగా కరోనా వైరస్ సోకిన వ్యాధిగ్రస్తుల పై టెస్ట్ లు చేయగా..రుచిని గ్రహించే శక్తి లేకపోయినా కరోనా వైరస్ సోకినట్లు తేలిందని చెప్పింది. దీన్ని అధికారికంగా డాక్టర్లు ప్రకటించలేదు. అయితే ఇందులో వాస్తవం ఎంతుందో తెలుసుకునేందుకు సన్ ఆన్ లైన్ మీడియా ఓ టెస్ట్ చేసింది. సన్ ఆన్ లైన్ ఉద్యోగి జాన్ , చార్లెట్ అనే యువతి హోం క్వారంటైన్ లో ఉంటున్నారు. ప్రయోగంలో భాగంగా యువతి చార్లెట్ ఆవాల పిండి, వెల్లులితో పాటు పలురకాల దినుసుల్ని తిన్నది. కానీ తనకు ఎలాంటి టేస్ట్, స్మెల్ రాలేదని చెప్పింది. అంతేకాదు ఈ టెస్ట్ చేసిన కొద్దిరోజులకు తేలికపాటు జలుబు తో పాటు తుమ్ములు , కండరాల నొప్పులు ఉన్నాయని చెప్పిన యువతి..తనకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించింది. కర్రీ టేస్ట్ గా ఉండేందుకు ఉపయోగించే మార్తైట్, ఎండు మిర్చి తిన్నా ఎలాంటి స్పర్శలు లేవని తెలిపింది.ఇక సన్ ఆన్ లైన్ ఉద్యోగి జాన్ కూడా అంతే ఉల్లిగడ్డ తో పాటు వెనిగర్ ను తాగాడు. వెనిగర్ నీళ్లు తాగినట్లే ఉంది. ఉల్లిని గడ్డను యాపిల్ తిన్నట్లు తిన్నా ఎలాంటి టేస్ట్ లేదు. 13వ రోజు తనకు జ్వరం లేకపోయినప్పటికీ, దగ్గు, గొంతు నొప్పి మరియు బ్రీతింగ్ సమస్యతో బాధపడుతున్నాను. వాసన కోల్పోతే కరోనా వైరస్ సోకుతుందనే విషయాన్ని గట్టిగా నమ్ముతున్నట్లు చెప్పాడు. కాగా జాన్, చార్లెట్ లో కరోనా టెస్ట్ లో పాల్గొనే సమయంలో తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *