వాషింగ్టన్: ఊబకాయానికి అడ్డుకట్ట వేసే సరికొత్త చికిత్సా విధానాలు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా కాలేయ కణాలు సహా దాదాపు అన్ని కణాల్లోనూ ‘ఏహెచ్ఆర్’ అనే గ్రాహకం (రిసెప్టార్) ఉంటుంది. కొవ్వు సంబంధిత జీవక్రియలకు అవసరమైన జన్యువుల క్రమబద్ధీకరణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని లక్ష్యంగా చేసుకుంటే బరువు పెరుగుదలను నియంత్రించవచ్చునని అమెరికా పరిశోధకులు తాజాగా గుర్తించారు. ‘ఎన్ఎఫ్’ అనే ఔషధంతో ఈ గ్రాహకాన్ని నియంత్రించినప్పుడు.. అధిక కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలను ఆరగించినప్పటికీ ఎలుకలు బరువు పెరగడం లేదని పరిశోధకులు తేల్చారు. ఊబకాయ ఎలుకలకు ఈ ఔషధాన్ని కొన్ని వారాలపాటు ఇచ్చినప్పుడు బరువు తగ్గడాన్ని కూడా వారు గుర్తించారు. కొవ్వు నిల్వ, ఉత్పత్తికి అవసరమైన పలు కీలక జన్యువులను ప్రేరేపించకుండా ఏహెచ్ఆర్ను ‘ఎన్ఎఫ్’ అడ్డుకుంటుండటమే అందుకు కారణమని పరిశోధకులు వరించారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]