[spt-posts-ticker]

ఎయిడ్స్ వ్యాధి పై విస్తృత ప్రచారం కల్పించాలి

జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ.

నిర్మల్,(ఆరోగ్యజ్యోతి): ఎయిడ్స్ వ్యాధి పై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ వైద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్.ఐ.వి, ఎయిడ్స్ కు సంబంధించిన గోడ ప్రతులను ఆయన ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు.ఎయిడ్స్ తో బాధపడేవారికి మందుల కంటే తోటివారి ఆదరణ, ఆప్యాయతలు, సమాజ తోడ్పాటు ఎంతో అవసరమన్నారు. ఎయిడ్స్ రహిత నిర్మల్ జిల్లా స్థాపనకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా హెచ్.ఐ.వి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజ్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కార్తీక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *