[spt-posts-ticker]

ఐదు రోజుల్లో 6,798 మందికి వైరస్​

కరీంనగర్(ఆరోగ్యజ్యోతి): ‘జనాలు మస్తు తిరుగుతున్నరు. టిఫిన్​సెంటర్లు, రెస్టారెంట్లు ఎక్కడ చూసినా జనమే జనం. బరాత్​ల డ్యాన్సులతో ధూం ధాం చేస్తున్నరు. ఎవలన్నా మాస్కులు పెట్టుకుంటున్నరా? ఎహే పో..ఎక్కడుంది కరోనా..ఎప్పుడో ఖతమైంది. వైరస్​వీకయింది భయ్. చల్ ఊరికి నడువ్​. మనోళ్లను కూడా రమ్మను . ఈసారి దావత్​అదిరిపోవాలె ’ అంటూ దసరాకు చాలామంది ఫుల్​ఎంజాయ్​చేశారు. పట్నంలో ఉండే వాళ్లంతా ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించకుండా కిక్కిరిసిన బస్సుల్లో పల్లెలకు పోయిండ్రు. దసరా నాడు జమ్మి పెట్టుకుని అలయ్​బలయ్​ తీసుకున్నరు. ఎప్పుడూ ఎంతో జాగ్రత్తగా ఉండే మహిళలు కూడా బతుకమ్మ సందర్భంగా కరోనా రూల్స్​పాటించలేదు. గ్రూపులు గ్రూపులుగా కలిసి మాస్కులు లేకుండా, ఫిజికల్​డిస్టెన్స్​పాటించకుండా మామూలు రోజుల్లో ఆడినట్టు బతుకమ్మ సంబురాలు జరుపుకొన్నరు. ఇంత చేసినంక కరోనా ఊకుంటదా… ఎవలకు పడితే వాళ్లకు అంటుకుంది. దసరా పండుగ తర్వాత కేసుల సంఖ్య పెరగడం దీన్ని రుజువు చేస్తోంది. అఫీషియల్​ లెక్కల ప్రకారం ఐదు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 6,798  కేసులు నమోదయ్యాయి. దీంతో డాక్టర్లు వేడుకల్లో పాల్గొన్నవారికి లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోమని సలహా ఇస్తున్నారు.బతుకమ్మ, దసరా పండుగల తరవాత  దాదాపుగా అన్ని జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 24న సద్దుల బతుకమ్మ జరుపుకోగా, 25న దసరా సెలబ్రేట్​చేసుకున్నారు. అయితే ఈ రెండు రోజుల్లో టెస్టుల కోసం చాలా తక్కువ మంది వచ్చారు. దీంతో రికార్డుల్లో సంఖ్య తగ్గింది. మరుసటి రోజు 26న స్టేట్ బులిటెన్​ ప్రకారం రాష్ట్రంలో 837 కేసులు  నమోదయ్యాయి. 27న  1,481, 28న 1,504, 29న 1,531, 30న 1,445 కేసులు నమోదయ్యాయి. ఇలా ఐదు రోజుల్లో 6 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని జిల్లాల్లో కేసుల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. గడిచిన ఐదు రోజుల్లో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 588, కరీంనగర్​లో 332​, కామారెడ్డిలో 271,  సిరిసిల్లలో 225, నిజామాబాద్​లో 211​, వరంగల్​ అర్బన్​లో 230, యాదాద్రి జిల్లాలో 178 చొప్పున కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 2,38,632 కేసులు నమోదు కాగా 1,336 మంది మృతిచెందారు.దసరా, బతుకమ్మ పండగలకు ముందు జనాలు కరోనా వైరస్ కు భయపడినా.. పండగకు ముందు వారం, పది రోజులు పట్టించుకోలేదు. బట్టల దుకాణాలు, కిరాణ హోల్ సెల్ షాపులు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ జనాలతో కిటకిటలాడాయి.  మాస్కు పెట్టుకోవాలి..ఫిజికల్​డిస్టెన్స్​పాటించాలి.. అనే విషయమే మర్చిపోయారు. ఊర్లకు వెళ్లే బస్సుల్లో కూడా ఇదే పరిస్థితి. ఒక్క కరీంనగర్ రీజియన్ పరిధిలోనే గత బుధవారం సుమారుగా కోటి ఆదాయం వచ్చిందంటే ఎంతమంది ప్రయాణికులు జర్నీ చేశారో అర్థం చేసుకోవచ్చు.

ఈ మూడు నెలలు కీలకం

కరోనా వైరస్ రాష్ట్రంలోకి ఫిబ్రవరి, మార్చిలో ఎంటర్​ అయింది. ఎండలు దంచి కొట్టే టైంలోనూ కేసులు భారీగా నమోదయ్యాయి. ఇప్పుడు చలికాలం వచ్చేసింది. దీంతో వైరల్​ఇన్ ఫెక్షన్లు తొందరగా వ్యాపిస్తాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటివి అటాక్  చేస్తుంటాయి.  ఇలాంటి టైంలో కరోనా విజృంభిస్తే కంట్రోల్​ చేయడం కష్టమని డాక్టర్లు అంటున్నారు. చలి తీవ్రత బాగా పెరిగితే మరణాలు కూడా పెరగవచ్చని హెచ్చరిస్తున్నారు. రాబోయే  మూడు నెలలు చాలా కీలకమని, మొదటి లాక్ డౌన్ లో ఎలాగైతే ఉన్నామో ఇప్పుడూ అలాగే ఉండాలని  సూచిస్తున్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *