[spt-posts-ticker]

కంటి ఆపరేషన్లు ఎప్పుడో

సూర్యాపేట,(ఆరోగ్యజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు లక్ష్యం చేరడం లేదు. మొదటి విడత కంటి పరీక్షలో అనేక మందికి శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉండగా వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అనేకమంది ఆపరేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు.జిల్లాలో 4లక్షల 46వేల 37మందికి పరీక్షలు నిర్వహించగా, 75,664మ ందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. 27,878మందికి ఆపరేషన్‌ కోసం సిఫారసు చేశారు. వాటికి నేటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి గ్రీన్‌సిగ్నల్‌ లభించలేదు. జిల్లాలో 26 బృందాలుగా ఏర్పడి 6నెలల పాటు కంటి చూపు తక్కువగా ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారు. అద్దాలతో కొంతమందిని సరిపెట్టారు. కేవలం 200మ ందికి మాత్రమే ఆపరేషన్‌ చేసి చూపును మెరుగుపర్చారు. ఇంకా 27వేల మందికిపైగా ఆపరేషన్లు చేయా ల్సి ఉండగా నేటి వరకు దీనిపై స్పష్టత రాలేదు. రెండో విడత కంటి పరీక్షలు తమకు చేస్తారని అనేక మంది ఎదురుచూస్తున్నారు.

జిల్లాలో 4.46 లక్షల మందికి పరీక్షలు

జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు పథకం కింద గ్రామా లు, పట్టణాలల్లో 26వైద్య బృందాలు, 4లక్షల 46వేల 37మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో పురుషు లు 2,04,838మంది, మహిళలు 2లక్షల 41వేల 172మ ంది, ఇతరులు 27మంది ఉన్నారు. 2లక్షల 82 వేల 907 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేని వారీగా పరీక్షల్లో గుర్తించారు.

అందులో తక్కువ దృష్టిలోపం ఉన్న వారికి జిల్లాలో 75,664మందికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. అదేవిధంగా ఎక్కువ దృష్టిలోపం ఉన్న 33,519 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. జిల్లాలో 40 ఏళ్ల లోపు ఉన్న 13,334 మంది, 40ఏళ్లపైన ఉన్న 62,330 మందికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. దీంతో పాటు జిల్లావ్యాప్తంగా 27,878మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. అదే విధంగా జిల్లాలో 7,371మంది కంటి శుక్లాల సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *