[spt-posts-ticker]

కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో.. లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కే ఒక్క మార్గం తెరిచి ఉంచాలి: కేటీఆర్‌

వచ్చే 10 రోజులు కీలకం: ఈటల

వైద్యసేవల కోసం 104 లేదా 040-21111111: సీఎస్‌

హైదరాబాద్‌,(ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలోని కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని  మంత్రి కేటీఆర్‌ ఉన్నతాధికారులకు సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో గుర్తించిన ప్రాంతాల్లో 100ు లాక్‌డౌన్‌ నిబంధనలు అమలయ్యేలా చూడాలని చెప్పారు. కేవలం ఒక్క మార్గం మాత్రమే తెరిచి ఉంచి పోలీసు పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. మంగళవారం మంత్రి కేటీఆర్‌ క్యాంప్‌ కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజేపీ మహేందర్‌రెడ్డి, మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శి శాంతికుమారి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, వైద్య, జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రానున్న 10 రోజులు కీలకమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. అనుమానితుల నుంచి శాంపిళ్లు సేకరించిన 24 గంటల్లో రిపోర్టు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్న అనుమానితులు, వైద్యసేవలు కావాలనుకున్నవారు 104 లేదా జీహెచ్‌ఎంసీలోని 040-21111111 నెంబర్‌కి ఫోన్‌ చేయవచ్చని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సూచించారు. సమీక్షలో పోలీసు కమిషనర్లు అంజనీకుమార్‌, సజ్జనార్‌, మహేశ్‌ భగవత్‌, వైద్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *