[spt-posts-ticker]

కరోనాకు ఆరోగ్య కార్యకర్తలూ బలి

రక్షణలేక చైనాలో ఆరుగురు మృతి.. 1,488కి చేరిన మరణాలు

బీజింగ్‌, టోక్యో, : చైనాలో కరోనా వైద్య సిబ్బందినీ బలి తీసుకుంటోంది. వందలు, వేల కొద్దీ బాధితులను పరీక్షిస్తుండటం.. మాస్కులు, బాడీ సూట్స్‌ వంటి రక్షణ సామగ్రి సరిపడా లేకపోవడంతో వారు వైరస్‌ బారినపడుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్‌ -19 కారణంగా ఆరుగురు ఆరోగ్య కార్యకర్తలు మృతి చెందారని, 1,716 మందికి వైరస్‌ నిర్ధారణ అయిందని జాతీయ ఆరోగ్య కమిషన్‌ ప్రకటించింది. దీంతో యంత్రాంగం అత్యవసరంగా పరికరాల పంపిణీ చర్యలు చేపట్టింది. మరోవైపు చైనాలో కరోనా మరణాలు 1,488కు చేరాయి. కొత్తగా 121 మంది మృతి చెందారు. వీరిలో 116 మంది హుబెయ్‌ ప్రావిన్స్‌వారే.. భారత్‌లో కరోనా అదుపులో ఉందని, ప్రధాన మంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటోందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. జపాన్‌ నౌకలోని 138 భారతీయుల్లో మూడో వ్యక్తికి కొవిడ్‌-19 సోకినట్లు తేలింది. వారిని ఆసుపత్రికి తరలించినట్లు ఎంబసీ తెలిపింది. వైరస్‌ పరీక్షలు నెగిటివ్‌గా తేలిన 80 ఏళ్లు పైబడిన వృద్ధులను జపాన్‌ నౌక నుంచి తరలించి ఐసోలేషన్‌కు పంపుతోంది. పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం నుంచి ఢిల్లీ-హాంకాంగ్‌ విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్లు స్పైస్‌ జెట్‌ ప్రకటించింది. పారదర్శకత లోపించడంతో.. వైర్‌సకు సంబంధించిన సమాచారాన్ని అమెరికాతో పంచుకునేందుకు చైనా నిరాకరించింది. తమ చొరవను అడ్డుకోవడంపై అమెరికా అభ్యంతరం చెప్పింది. కరోనాపై పోరాటానికి మద్దతిస్తామని ప్రకటించిన  భారత ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపింది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *