[spt-posts-ticker]

కరోనాతో ఒకరు మృతి.. అంత్యక్రియల్లో పాల్గొన్న వారిపై నిఘా

బెంగళూరు : దేశంలో కరోనా వైరస్‌తో మృతి చెందిన తొలి వ్యక్తి 76 ఏళ్ళ మహమ్మద్‌ సిద్దిఖి హుసేనీ అంత్యక్రియలలో పాల్గొన్న వారందరిపైనా నిరంతర నిఘా కొనసాగుతోంది. హుసేనీ కరోనా బారిన పడి హైదరాబాద్‌లో మృతి చెందగా కలబుర్గిలో అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే. మృతి చెందినప్పటికి ల్యాబ్‌ రిపోర్టులు రాకపోవడంతో అనుమానితుడిగానే భావించారు. మరుసటి రోజున కరోనా వైరస్‌ ద్వారానే మృతి చెందినట్లు నిర్ధారణ  అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి నలుగురిని మాత్రమే ఐసోలేషన్‌ విభాగంలో ఉంచి చికిత్సలు అందిస్తుండగా మిగిలిన 67మందిని ఆసుపత్రి నుంచి బయటకు రాకుండా పర్యవేక్షిస్తున్నారు.

ఐసోలేషన్‌ విభాగంలో చికిత్సలు పొందుతూ మృతి చెందుతున్న నలుగురికి సంబంధించిన గల్ల పరీక్షలు ఇంకా రావాల్సి ఉంది. హుసేనీ సౌదీ అరేబియా నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చి నేరుగా కలబురిగికి రాలేదని రెండు రోజుల పాటు విజయపుర జిల్లా తాళికోటలోని బంధువుల నివాసంలో గడిపిన మేరకు విజయపుర జిల్లాను అప్రమత్తం చేశారు.

ప్రత్యేకించి తాళికోటలోని బంధువులపైనా నిఘా ఉంచారు. శనివారం జిల్లా కలెక్టర్‌ శరత్‌ ఆసుపత్రిని సందర్శించారు. అంత్యక్రియలలో పాల్గొన్న 67మందికి అందిస్తున్న చికిత్సలు గురించి ఆరా తీశారు.  కరోనా పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కానీ అప్రమత్తం అవసరమన్నారు. అనుమానం వస్తే కాల్‌సెంటర్‌, హెల్ప్‌లైన్‌ల సాయం పొందవచ్చు అన్నారు. వైరస్‌ సోకిన వారితో సన్నిహితంగా ఉంటే మాత్రమే సోకే అవకాశం ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చేవారిపై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *