[spt-posts-ticker]

‘కరోనా’పై అపోహలొద్దు రాష్ట్రంలో వైరస్‌ జాడ లేదు

  • వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల

హుజూరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): కరోనా వైరస్‌ పై అపోహలు వద్దని, రాష్ట్రంలో అలాంటి వైరస్‌ జాడ లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని కోరారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో సోమవారం మీడియాతో మంత్రి మాట్లాడారు. ఒకవేళ వచ్చి నా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. గాంధీ దవాఖానలో ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీ సంయుక్తంగా హైదరాబాద్‌లో జనావాసాలకు దూరంగా యుద్ధప్రతిపాదికన మూడు వందల పడకల ప్రత్యేక దవాఖానను నిర్మిస్తున్నట్టు చెప్పారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *