[spt-posts-ticker]

కరోనాపై అప్రమత్తతే అత్యవసరం

బూర్గంపాడు (భద్రాద్రి కొత్తగూడెం): కరోనా వైరస్‌ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో ఆర్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన ముందు జాగ్రత్తలను పాటించాలని వివరించారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తే చర్యలు తప్పవని, ఈ నెల 31 వరకు మండల పరిధిలో వారపు సంతలు రద్దు చేయాలని, సినిమా హాళ్లు మూసి వేయాలని పేర్కొన్నారు. జన సమూహలకు దూరంగా ఉండాలని, స్వీయ రక్షణ చర్యలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిశోర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారి డాక్టర్‌ లాస్య, పీఆర్ ఏఈ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *