కామారెడ్డి : కరోనా(కొవిడ్-19) వైరస్ వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా పాలనాధికారి శరత్ సూచించారు. జనహిత భవన్లో ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు అన్ని విద్యా సంస్థలను ఈ నెల 31వ వరకు మూసివేయాలని ఆదేశించారు. ఇంటర్, పదో తరగతి పరీక్షలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా సినిమా హాళ్లు, పార్కులు, ఈత కొలనులు, వ్యాయామశాలలను ఈ నెల 21వ తేదీ వరకు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మున్సిపాలిటీ, ఆర్టీసీ, రైల్వేల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. బహిరంగ సమావేశాలు, వేసవి శబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ నెల 21వ తేదీ వరకు నిర్వహించవద్దని సూచించారు. కరోనా వైరస్‌పై ఎలాంటి అవాస్తవిక ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కరోనాపై అప్రమత్తత
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]