[spt-posts-ticker]

కరోనాపై చిల్లర రాజకీయాలు చేయడం సరికాదు: ఈటల

నిజామాబాద్: వైద్యశాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. కరోనాపై చిల్లర రాజకీయాలు చేయడం సరికాదని హెచ్చరించారు. ‘‘ప్రతిపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే పాటిస్తాం. కరోనాను అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధిస్తుంది. దేశంలో కేవలం 3 శాతం.. తెలంగాణలో ఒక శాతమే కరోనా మరణాల రేటు ఉంది. కొందరు కావాలనే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అవసరమైన డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ వర్కర్లను నియమించుకోవాలి. జిల్లా ప్రభుత్వాస్పత్రిలో 450 బెడ్లకు ఆక్సిజన్ సరఫరా చేసేలా ఉన్నాయి. బోధన్, ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రుల్లో ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తాం. ప్రతి ఇంట్లో ఆరోగ్య కార్యకర్తలు సర్వే చేసి లక్షణాలు ఉంటే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలి’’ అని ఈటల సూచించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *